Dharmendra Pradhan: సనాతన ధర్మంపై మరో డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి

|

Sep 08, 2023 | 7:36 AM

ఇటీవల సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా మరో డీఎంకే నేత.. ఎంపీ రాజా సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. సనాతన ధర్మాన్ని సామాజిక వ్యాధులతో పోల్చారు.

Dharmendra Pradhan: సనాతన ధర్మంపై మరో డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి
Union Minister Dharmendra Pradhan
Follow us on

ఇటీవల సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా మరో డీఎంకే నేత.. ఎంపీ రాజా సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. సనాతన ధర్మాన్ని సామాజిక వ్యాధులతో పోల్చారు. మంచి హిందువు.. సముద్రం దాటి విదేశాలకు వెళ్లకూడదు. ప్రధాని మోదీ పని ఎప్పుడూ ఎక్కడక్కడికో వెళ్లడమే అంటు మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించి రాజా ఇలా వ్యాఖ్యలు చేశారు. అలాగే మోదీ సనాతన ధర్మ సూత్రాలను ఉల్లంఘించారని ఆరోపించారు. శంకరాచార్యుల సమక్షంలో ఢిల్లీలో సనాతన ధర్మంపై చర్చకు రావాలని బీజేపీ నేతలకు సవాలు చేశారు. అలాగే ఢిల్లీలో ఈ చర్చలకు తేదీని నిర్ణయించాలని ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ నేతలకు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా.. ఇండియా కూటమి మానసికంగా దివాలా చెందినట్లు బీజేపీ ఆరోపణలు చేసింది. డీఎంకే నాయకుడు రాజా చేసిన వ్యాఖ్యలు హిందూఫోబియాను ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. అయితే డీఎంకే నాయుకుడు రాజా చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ వేశారు. ఈసారి డీఎంకే నేత రాజా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దారుణమైనవని అన్నారు. అలాగే విపక్షాల ఇండియా కూటమిని చుట్టుముట్టిన మానసిక దివాలతో సహా.. లోతుగా పాతుకుపోయినటువంటి హిందూఫోబియాను ప్రతిబింబిస్తున్నాయంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు.. వారి స్నేహితులు.. భారతదేశ మూలాలను ఏ విధంగా దూషిస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారని చెప్పారు. సనాతన ధర్మమే శాశ్వతమైనదని.. అదే సత్యమంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడంపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకేలో ఉన్నటువంటి డీ అంటే డెంగ్యూ, ఎమ్ అంటే మలేరియా, కే అంటే దోమ అని.. ఈ పార్టీని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారం చేపట్టిన ఐదేళ్లలో మొదటి ఏడాది సనాతన ధర్మా్న్ని ఈ పార్టీ వ్యతిరేకించిందని.. రెండో ఏడాది సనాత ధర్మాన్ని రద్దు చేయాలని.. అలాగే మూడో ఏడాది దీన్ని నిర్మూలించాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే 4-5 ఏడాదిలో మళ్లీ తాము హిందువులమే అని చెప్పుకుంటారని.. దశాబ్దాలుగా డీఎంకే ఇదే చేస్తుందని ఆరోపించారు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు వారు.. అమర్, అక్బర్, ఆంథోనీలాగా అవతారం ఎత్తుతారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఇలాంటి వ్యూహంతోనే 17 సంవత్సరాల నుంచి ఓడిపోతున్నారని విమర్శలు గుప్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..