Union Cabinet Expansion 2021: మోదీ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులు వీరే.. పూర్తి వివరాలు మీకోసం..

Union Cabinet Expansion 2021: మోదీ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులు వీరే.. పూర్తి వివరాలు మీకోసం..
Cabinet

Union Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ ఒక్కొక్కటిగా వీడుతోంది. ఇప్పటికే కొత్త మంత్రుల ప్రమాణ..

Shiva Prajapati

|

Jul 07, 2021 | 4:40 PM

Union Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ ఒక్కొక్కటిగా వీడుతోంది. ఇప్పటికే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అవగా.. ఇప్పుడు కేంద్ర కేబినెట్‌లో ఎవరెవరు చోటు దక్కించుకోబోతున్నారనే దానిపై క్లారిటీ వస్తోంది. దాదాపు 18 మంది ప్రధాని నరేంద్ర మోదీ జట్టులో చేరనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వీరంతా ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రులు, వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. శోభ కరందలాజే, కర్ణాటక వయస్సు: 54 సంవత్సరాలు కర్ణాటక బీజేపీ నాయకురాలు ఉడుపి చిక్‌మంగళూర్‌ నుంచి రెండోసారి గెలుపొందారు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం. 2008-13 మధ్య ఎమ్మెల్యే, కర్ణాటక పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి విద్యార్హతలు: ఎంఏ సోషియాలజీ

2. భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ, ఉత్తరప్రదేశ్‌ వయసు: 63 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్‌ బీజేపీ నేత జాలౌన్‌ నుంచీ 1996 నుంచీ 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. విద్యార్హతలు: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ

3. శర్బానంద సోనోవాల్‌, అస్సాం వయస్సు: 59 సంవత్సరాలు అస్సాం బీజేపీ నేత, 2014-16 మధ్య ఒకసారి కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2016 మే నుంచీ 2021 మే 10 వరకూ అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విద్యార్హతలు: బిఏ, ఎల్‌ఎల్‌బీ

4. జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్‌లో వయస్సు: 50 సంవత్సరాలు మధ్యప్రదేశ్‌లో 2001లో తండ్రి మాధవరావ్‌ సింధియా మరణంతో రాజకీయ ప్రవేశం, 2001-14 వరకూ నాలుగు సార్లు గుణ నియోజకవర్గం నుంచి ఎన్నిక, 2007-14 మధ్య యూపీఏ మంత్రివర్గంలో కమ్యూనికేషన్స్‌, పరిశ్రమల శాఖల మంత్రి, 2019లో ఓటమి, 2020 మార్చిలో బీజేపీలో చేరిక, 2020 జూన్‌లో రాజ్యసభ సభ్యత్వం, విద్యార్హతలు: ఎంబీఏ

5. నారాయణ్‌ రాణే, మహారాష్ట్ర వయస్సు: 69 సంవత్సరాలు తొలుత శివసేనలో, తరువాత 2017 వరకూ కాంగ్రెస్‌, 1999లో కాంగ్రెస్‌ తరపున సీఎంగా పని చేసిన రాణే 2017లో సొంత పార్టీ మహారాష్ట్ర స్వాభిమాన్‌ పక్ష పార్టీ స్థాపన 2018లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నిక

6. దర్శన విక్రమ్‌ జర్దోష్‌, గుజరాత్‌ వయస్సు: 60 సంవత్సరాలు గుజరాత్‌ బీజేపీ నేత, సూరత్‌ నుంచీ వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు: బీకాం డిగ్రీ, నిట్‌ లో సర్టిఫికేట్‌ కోర్స్‌ ఇన్‌ కంప్యూటర్స్‌

7. నితిష్‌ ప్రామాణిక్‌, పశ్చిమబెంగాల్‌ వయస్సు: 35 సంవత్సరాలు తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచీ బీజేపీలో చేరి 2019లో కూచ్‌బేహార్‌ నుంచీ లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు: బీసీఏ డిగ్రీ

8. శంతను ఠాకూర్‌, పశ్చిమబెంగాల్‌ వయస్సు: 38 సంవత్సరాలు 2019లో బీజేపీ తరపున బంగాన్‌ లోక్‌సభ నుంచీ ఎన్నిక విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ (హానర్స్‌)

9. భూపేందర్‌ యాదవ్‌, రాజస్థాన్‌ వయస్సు: 52 సంవత్సరాలు 2012 నుంచీ రెండోసారి రాజ్యసభలో బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం విద్యార్హతలు: బ్యాచిలర్‌ ఆఫ్‌ లా డిగ్రీ

10. అశ్వని వైష్ణవ్‌, ఒడిశా వయస్సు: 52 సంవత్సరాలు 2019లో ఒడిశా నుంచీ బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నిక విద్యార్హతలు: ఎంటెక్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌, మాజీ ఐఏఎస్‌(1994 బ్యాచ్‌)

11. కపిల్‌ పాటిల్‌, మహారాష్ట్ర వయస్సు: 60 సంవత్సరాలు ఎన్సీపీ నుంచీ బీజేపీలో చేరి 2014, 2019లలో భివాండీ లోక్‌సభ స్థానం నుంచీ ఎన్నిక విద్యార్హతలు: బీఏ డిగ్రీ

12. మీనాక్షీ లేఖి, ఢిల్లీ వయస్సు: 54 సంవత్సరాలు బీజేపీ తరపున న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచీ 2014, 2019లలో ఎంపీగా ఎన్నిక విద్యార్హతలు: ఎల్‌ఎల్‌బీ లా డిగ్రీ

13. అజయ్ భట్, ఉత్తరాఖండ్ వయస్సు: 60 సంవత్సరాలు 2019లో నైనిటాల్ ఉద్దం సింగ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నిక 2017వరకు ఉత్తరఖండ్ ప్రతిపక్షనేతగా అజయ్ బట్, రానికేట్ నుంచి మూడు సార్లు ఎన్నిక విద్య: బీఏ, ఎల్ఎల్ బీ

14. పశుపతి పరాస్, బీహార్ వయస్సు: 69 సంవత్సరాలు లోక్ జన్ శక్తి పార్టీ 1977-2010 వరకు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నిక 2017-19 వరకు ఎమ్మెల్సీ, 2019లో హాజీపూర్‌ లోక్‌సభ నుంచీ ఎన్నిక

15. భారతీ పవార్‌, మహారాష్ట్ర వయస్సు: 43 సంవత్సరాలు 2019లో దిందోరి నియోజకవర్గం నుంచీ మొదటిసారి లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు: పూనే యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. డిసెంబర్‌ 2019లో బెస్ట్ పార్లమెంటేరియన్‌ అవార్డుకు ఎంపిక

16. సునీత దుగ్గల్‌, హర్యానా వయస్సు: 53 సంవత్సరాలు 2019లో సిర్‌సా నియోకవర్గం నుంచీ లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు: ఎంస్సీ కెమిస్ట్రీ, ఐఆర్‌ఎస్‌

17. ప్రీతం ముండే, మహారాష్ట్ర వయస్సు: 38 సంవత్సరాలు 2014, 2019లలో బీడ్‌ నియోజకవర్గం నుంచీ లోక్‌సభకు ఎన్నిక బీజేపీ మాజీ డిప్యూటీ సిఎం, కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్‌ ముండే కుమార్తె విద్యార్హతలు: ఎంబీబీఎస్‌, ఎండీ డాక్టర్‌

18. ఆర్పీ సింగ్‌, బీహార్‌, జేడీయూ వయస్సు: 62 సంవత్సరాలు మాజీ ఐఏఎస్‌, 2010 నుంచీ జేడీయూ రాజ్యసభ ఎంపీ విద్యార్హతలు: ఎంఏ గ్రాడ్యుయేట్‌

Also read:

Pakistan: కుక్క తోక, పాకిస్తాన్ బుద్ధి ఒక్కటే! సరిహద్దులో మళ్లీ అదే పని చేస్తోంది..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

RAPO 19 : నయా మూవీ షూటింగ్ షురూ చేయనున్న ఎనర్జిటిక్ స్టార్.. ఎప్పటినుంచంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu