రియా చక్రవర్తి ఆచూకీ ఎక్కడ? తెలియదంటున్న బీహార్ పోలీసులు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయనగర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆచూకీ తెలియడంలేదని బీహార్ పోలీసులు అంటున్నారు. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతున్నామని..

  • Updated On - 12:43 pm, Sun, 2 August 20 Edited By: Pardhasaradhi Peri
రియా చక్రవర్తి ఆచూకీ ఎక్కడ? తెలియదంటున్న బీహార్ పోలీసులు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయనగర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆచూకీ తెలియడంలేదని బీహార్ పోలీసులు అంటున్నారు. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతున్నామని ఈ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే అన్నారు. ఈ కేసు దర్యాప్తు తొలిదశలో ఉందని, కోర్టు లోనూ పిటిషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ఇంకా దీనిపై తీర్పు ఇవ్వవవలసి ఉందన్నారు. అయితే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నపిటిషనర్ అభ్యర్థనను కోర్టు కొట్టివేసిన విషయం తనకు తెలియనట్టే ఆయన మాట్లాడారు. ముంబై పోలీసులు ఈ కేసు విచారిస్తున్నారని, వారిని వారి పని చేసుకోనివ్వండని సాక్షాత్తూ సీజేఐ జస్టిస్ బాబ్డే మొన్నటికి మొన్న తమ రూలింగ్ ఇచ్చారు. కానీ ఇంత ముఖ్యమైన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల తాలూకు వార్తలను ఆయన చదవలేదా.. లేక కావాలనే ఈ విషయాన్ని దాటవేస్తున్నారా అన్నది అర్థం కావడంలేదంటున్నారు. పైగా ప్రస్తుతానికి రియా చక్ర వర్తిని ప్రశ్నించే యోచనకూడా లేదని డీజీపీ సెలవిచ్చారు.

తనకుమారుడిని ఆత్మహత్య చేసుకునేలా రియా, ఆమె కుటుంబ సభ్యులు ప్రేరేపించారని సుశాంత్ తండ్రి కేకే ఖాన్ పాట్నా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ముంబై పోలీసుల విచారణలో తనకు న్యాయం జరగదని భావించే ఆయన బీహార్ పోలీసులవద్దకు వెళ్లారు. సుశాంత్ తో డేటింగ్ చేసిన రియా ఆచూకీ కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఈ రాష్ట్ర ఖాకీలు చెబుతున్న కొత్త సాకు చూస్తే ఆమె పాత్రను ‘కవరప్’ చేసే యత్నంలో భాగమే ఇదని తెలుస్తోంది.