Models’ deaths: మోడల్స్ మరణాల వెనుక మిస్టరీ.. సంచలనంగా మారిన ఆమె చివరి ఇన్​స్టా పోస్ట్

మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌, రన్నరప్‌ అంజనా షాజన్‌లను మృత్యువు ఎందుకు తరుముకొచ్చింది?.. వాళ్ళ కారుని ఛేజ్‌ చేసిందెవరు?... అన్సీ కబీర్‌, అంజనా షాజన్‌ల డెత్‌ మిస్టరీలో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది.

Models' deaths: మోడల్స్ మరణాల వెనుక మిస్టరీ.. సంచలనంగా మారిన ఆమె చివరి ఇన్​స్టా పోస్ట్
Anjana Shajan... Ansi Kabeer
Follow us

|

Updated on: Nov 24, 2021 | 9:08 PM

కేరళ అందాల రాసుల స్వప్నాలను ఛిద్రం చేసిందెవరు? మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌, రన్నరప్‌ అంజనా షాజన్‌లను మృత్యువు ఎందుకు తరుముకొచ్చింది?.. వాళ్ళ కారుని ఛేజ్‌ చేసిందెవరు?… అన్సీ కబీర్‌, అంజనా షాజన్‌ల డెత్‌ మిస్టరీలో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. డ్రగ్‌ మాఫియా డాన్‌కీ యాక్సిడెంట్‌కీ సంబంధముందా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దక్షిణ భారత దేశంలో సంచలనం సృష్టిస్తోన్న మోడల్స్‌ డెత్‌ కేసులో… తవ్వేకొద్దీ వెలుగు చూస్తోన్న చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి.

ఆడవాళ్ళూ కలలు కంటారు. పెళ్ళి పేరుతో ఆమె కలలకు సంకెళ్ళు వేయొద్దు. ఆ స్వప్నాలను ఛిద్రం చేయొద్దు….కేరళ మాజీ మిస్‌ అంతరంగమిది. భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్న కేరళ మాజీ మిస్‌ అన్సీ కబీర్‌ కలలు మాత్రం అర్థాంతరంగా అంతమయ్యాయి. అనుమానాస్పద రోడ్డు ప్రమాదం రూపంలో ఆమె కన్న కలలు ఛిద్రమయ్యాయి. ఆమెతో పాటు కేరళ అందాలరాశి, మాజీ మిస్‌ రన్నరప్‌ అంజనా కూడా కనిపించని కుట్రలకు బలయ్యారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

నవంబర్‌ 1న కేరళ అందాల సుందరి, మాజీ మిస్‌ అన్సీ కబీర్‌, రన్నరప్‌ అంజనా షాజన్‌, మరో ఎడ్వర్టైసింగ్‌ ప్రొఫెషనల్‌ మొహమ్మద్‌ ఆషిక్‌ల మరణం యావత్‌ దక్షిణ భారత దేశంలో సంచలనంగా మారింది. నవంబర్‌ 1 తెల్లవారుజామున కొచ్చిలోని హోటల్‌ నంబర్‌18లో జరిగిన ఓ పార్టీకి అటెండ్‌ అయి వస్తుండగా జరిగిన ఈ రోడ్డు యాక్సిడెంట్‌ మొత్తం ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది. స్పాట్‌లోనే కేరళ అందాల రాసులిద్దరినీ మృత్యువు కబళించింది. ఆ తరువాత అడ్వర్టైజింగ్‌ ప్రొఫెషనల్‌ మొహమ్మద్‌ ఆషిక్‌ మరణించారు. అయితే దీన్ని అంతా ప్రమాదంగానే భావించారు.కానీ రోజులు గడిచేకొద్దీ అది నిజంగా ప్రమాదమేనా? లేక ఈ యాక్సిడెంట్‌ వెనుక ఏదైనా కుట్రకోణం దాగివుందా? అన్న అనుమానం అందర్నీ వెంటాడింది.

ఆడవాళ్ళకీ కలలుగనే స్వేచ్ఛ ఉందంటూ తన అంతరంగాన్ని విప్పిచెప్పిన కేరళ మాజీ మిస్‌ అందాల భామ అన్సీ కబీర్‌ కి భవిష్యత్తుపై ఎన్నో ఆశలున్నాయి. అతిచిన్న వయస్సులోనే అనుమానాస్పద యాక్సిడెంట్‌లో మరణించిన ఈ ఇద్దరూ ఏదో సాధారణ మహిళలు కాదు. అందులో అన్సీ కబీర్‌ ఇంజనీర్‌ అయితే, అంజనా షాజన్‌ ఓ డాక్టర్‌.  అన్సీ కబీర్‌ తిరువనంతపురంలోని కాఝ కొట్టామ్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేసి, ఇన్ఫోసిస్‌లో తన జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆమె 2018లో మోడలింగ్‌లోకి ఎంటరై, అనతి కాలంలోనే 2019లో మిస్‌ కేరళగా స్థానాన్ని కొట్టేసి, కేరళీయుల మనసుదోచుకున్నారు. ఆ తరువాత నుంచి ఆమె కన్న కలలన్నీ మూవీ ఇండస్ట్రీలో యాక్టింగ్‌పైనే. మిస్‌ కేరళగా ఎన్నికయ్యాక రెండేళ్ళకే అన్సీ కబీర్‌ మిస్‌ సౌత్‌ఇండియా కిరీటాన్ని కూడా చేజిక్కించుకున్నారు. 2019లోనే అన్సీ కబీర్‌ మిస్‌కేరళగా ఎన్నికైనప్పుడే అంజనా షాజన్‌ రన్నరప్‌గా నిలిచారు. అంజనా షాజన్‌ కేరళలోని కెఎంసీటీ ఆయుర్వేద మెడికల్‌ కాలేజీ నుంచి ఆయుర్వేద వైద్యంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 2019 తరువాత మోడలింగ్‌పై శ్రద్ధపెట్టారీమె. అనేక యాడ్స్‌లో నటించారు.

నవంబర్‌ 1న అసలేం జరిగింది..

హోటల్‌ 18లో జరిగిన పార్టీకి హాజరై అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఎర్నాకులం బైపాస్‌ రోడ్డులో వస్తుండగా ఓ టూవీలర్‌ని తప్పించబోయి ఈ మోడల్స్‌ ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొట్టింది. మొదట తాగి రాష్‌ డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ యాక్సిడెంట్‌ జరిగిందంటూ పోలీసులు డ్రైవర్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ని అరెస్ట్‌ చేశారు.: ఇది అందరికీ తెలిసిందే… కానీ కుటుంబ సభ్యులను ఈ అరెస్టు కుటుంబ సభ్యులను సంతృప్తి పరచలేదు. హోటల్‌ యజమానులను ఎందుకు ప్రశ్నించలేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.  దీంతో ఇన్వెస్టిగేషన్‌ మొదలైంది. పోలీసుల దర్యాప్తులో సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో పార్టీ జరిగిన ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌, అలాగే పార్కింగ్‌ విజువల్స్‌ మాయం అయ్యాయి. అదే అనుమానానికి తెరతీసింది.

ఇంతకీ ఆ అర్థరాత్రి హోటల్‌ 18లో ఏం జరిగింది?

హోటల్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ మాయమైనట్లు గుర్తించారు పోలీసులు. పార్టీ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ కి సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేశారని పోలీసులు గుర్తించారు. విచారణలో ఆ హార్డ్‌ డిస్క్‌ని నీళ్ళల్లో విసిరేసినట్టు తేలింది. కొచ్చిలోని కన్నమ్‌గట్టు బ్రిడ్జ్‌ కింద నీటిలో పోలీసులు సెర్చింగ్‌ ప్రారంభించారు. నవంబర్‌ 17న హోటల్‌ స్టాఫ్‌ వయాలత్‌ అరెస్ట్‌తో అంతా ఎలర్ట్‌ అయ్యారు. అయితే ఆ రెండో రోజే అంతా బెయిల్‌ పై విడుదలవడం మరో ట్విస్ట్‌.

ఇంతకీ ఆ అర్థరాత్రి హోటల్‌లో జరిగిందేమిటి? ఆ ఫుటేజ్లో ఏముంది? అక్కడే అసలు విషయం దాగుంది. అన్సీ కబీర్‌, అంజనా షాజన్‌, మొహమ్మద్‌ ఆషిక్‌ లకు ఆల్కహాల్‌, లేదా డ్రగ్స్‌ ఇస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉద్దేశపూర్వకంగానే వారికి డ్రగ్స్‌ ఇచ్చారని పోలీసుల అనుమానం. అయితే ఎక్సైజ్‌ నిబంధనలకు విరుద్ధంగా అక్టోబర్‌ 31 రాత్రి 9 తరువాత కూడా వారికి లిక్కర్‌ సరఫరా చేయడం మరో అనుమానానికి తావిచ్చింది.

పోలీసుల దర్యాప్తులో మరో కొత్త విషయం బయటపడింది. హోటల్‌లోనే మొదట ఘర్షణ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో ఈ ఇద్దరు మోడల్స్‌, తమ ఫ్రెండ్స్‌తో కలిసి హోటల్‌ బయటకు వచ్చారు. మార్గం మధ్యలోనే కారు టూవీలర్‌ ని తప్పించబోయి కంట్రోల్‌ తప్పి చెట్టుకి గుద్దేసింది. అయితే అంతటితో కథ అయిపోలేదు. అన్సీ కబీర్‌, అంజనాల కారుని మరోకారు వేటాడింది. అది ఆడి(ఫోర్డ్‌ ఫిగో) కారు. అలాగే పార్టీలో పార్టిసిపేట్‌ చేసిన చాలా మంది పేర్లను యాజమాన్యం దాచిపెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇంతకీ మోడల్స్‌ కారుని వెంటాడిన కారెవరిది?

వాయిస్‌ : మోడల్స్‌ కారుని వెంబడించింది ఎవరి కారో కాదు… డ్రగ్ మాఫియా గ్యాంగ్ స్టర్ సైజు థంకచ్చన్ కారు అని తేలడం కేసులో మరో భయానక అంశం ముందుకొచ్చింది. హోటల్‌ ఓనర్‌కి ఈ యాక్సిడెంట్‌ గురించి పదే పదే ఆ రాత్రి థంకచ్చన్‌ ఫోన్‌ చేసి చెప్పడంతో ఛేజింగ్‌ విషయం బయటపడింది. కొచ్చిలోని డ్రగ్ మాఫియా గ్యాంగస్టర్‌ సైజు థంకచ్చన్‌ ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిలుకి అప్లై చేశారు. అసలు విషయం ఏమిటంటే హోటల్‌ నంబర్‌ 18లో పార్టీ తరువాత, థంకచ్చన్‌ ఈ మోడల్స్‌తో మీట్‌ అయ్యేందుకు ఆహ్వానించాడు. అతని ప్రవర్తన అసభ్యంగా, అనుమానాస్పదంగా ఉండడంతో అతని ఆహ్వానాన్ని వీరు తిరస్కరించారు. అయితే రెచ్చిపోయిన థంకచ్చన్‌ వారి కారుని ఆడి కారులో వెంబడించాడు. డ్రగ్స్‌ పెడ్లర్‌ బారి నుంచి తప్పించుకోబోయి ఈ మోడల్స్‌ కారు చెట్టుకు ఢీ కొట్టిందా? లేక ఇంకా ఏదైనా మిస్టరీ ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసలు సైజు థంకచ్చన్ కోసం గాలిస్తున్నారు.

సనాతన సాంప్రదాయాలను తోసిరాజంటూ, తొలివేకువ కలలుకంటూ అన్సీ కబీర్‌ ఎదిగారు. ఆమె ఎంచుకున్న ప్రతిమార్గాన్ని వెనకుండి వెన్నుతట్టి నడిపించన తన తల్లిని అనుక్షణం గుర్తుచేసుకునేవారు అన్సీ కబీర్‌.  అయితే ఆశ్చర్యకరంగా అన్సీ కబీర్‌ మరణ వార్త విన్నవెంటనే అన్సీ కబీర్‌ తల్లి ఆత్మహత్యాయత్నం చేశారు. అదృష్టవశాత్తూ ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. అయితే అన్సీ కబీర్‌ తనకు పొంచి వున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టారా? యాక్సిడెంట్‌ని ముందే ఊహించడం సాధ్యమా? ఇప్పుడిదే ప్రశ్న యావత్‌ కేరళ సమాజాన్ని కుదిపేస్తోంది.

సరిగ్గా ఈ రోడ్డు ప్రమాదానికి గంట ముందు “ఇట్స్‌ టైమ్‌ టు గో” (ఇక నిష్క్రమణకు వేళయ్యింది) అనే కాప్షన్‌తో తన ఇన్‌స్ట్రాగ్రాంలో ఓ వీడియో అప్‌లోడ్‌ చేయడం అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది.

View this post on Instagram

A post shared by Ansi Kabeer (@ansi_kabeer)