దంతెవాడ జిల్లాలో పేలిన ఐఈడీ

దండకారణ్యం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఐఈడీ పేలుడు కలకలం రేపింది. జిల్లాలోని కాలేపాల్ ఫారెస్ట్ ప్రాంతంలో జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ..

  • Tv9 Telugu
  • Publish Date - 7:29 pm, Mon, 6 July 20
దంతెవాడ జిల్లాలో పేలిన ఐఈడీ

దండకారణ్యం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఐఈడీ పేలుడు కలకలం రేపింది. జిల్లాలోని కాలేపాల్ ఫారెస్ట్ ప్రాంతంలో జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మావోయిస్టులకు
సంబంధించిన ఓ క్యాంపును ధ్వంసం చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరు ఐఈడీ మందుపాతరలను భద్రతా బలగాలు గుర్తించాయి. మర్జూమ్, కాలేపాల్ ప్రాంతాల్లో కూంబింగ్ చేపడుతుండగా.. రెండు చోట్ల మూడు ఐఈడీ మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.