ట్రంప్ స్పీచ్ లో తప్పుల తడకలు.. పేర్లు, పదాల ‘తికమక’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం అహ్మదాబాద్ లోని క్రికెట్ స్టేడియంలో చేసిన ప్రసంగంలో అనేక చోట్ల వ్యక్తుల పేర్లను, చాయ్ పదాన్ని తప్పుగా పలకడంపై ట్విటర్ యూజర్లు సెటైర్లు, జోకులు పేల్చారు.

ట్రంప్ స్పీచ్ లో తప్పుల తడకలు.. పేర్లు, పదాల 'తికమక'
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 24, 2020 | 6:09 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం అహ్మదాబాద్ లోని క్రికెట్ స్టేడియంలో చేసిన ప్రసంగంలో అనేక చోట్ల వ్యక్తుల పేర్లను, చాయ్ పదాన్ని తప్పుగా పలకడంపై ట్విటర్ యూజర్లు సెటైర్లు, జోకులు పేల్చారు. అయితే కొందరు మాత్రం.. తప్పుల సంగతి పక్కన పెడితే..   స్పీచ్  బ్రహ్మాండంగా ఉందని ఆకాశానికెత్తేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రధాని మోదీని…  ట్రంప్..  ‘చాయ్ వాలా ‘అని సంబోధించడానికి బదులు.. ‘చివాలా’ అని పేర్కొన్నారు. ‘ది వేదాస్’అనే  పదం బదులు ‘ది వెస్తాస్’ అని, స్వామి వివేకానంద పేరును ‘స్వామి వివేక్ మాన్ ‘ అని పేర్కొన్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ పేరును ‘సూచిన్ టెండూల్కర్’ అని, విరాట్ కోహ్లీని ‘విరూట్ కోహ్లీ’ అని అంటే.. ‘షోలే’ మూవీని ‘షోజే’ అనితప్పుడు ప్రనౌన్సియేషన్ చేశారని వీరంతా ‘కనిపెట్టారు’. ‘ఇది….’ టెరిబుల్ ప్రనౌన్సియేషన్ బై ట్రంప్ ఆఫ్ హిందీ వర్డ్స్’ అని ఒకరు సెటైర్ వేస్తే..మరికొందరు.. ఈ వ్యక్తులపేర్లను ప్రస్తావించే ముందు ట్రంప్ తమ దేశంలో బాగా ‘హోమ్ వర్క్’ చేసినట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఏమైనా… హిందీ భాష, భారతీయ వ్యక్తులు,  వస్తువులు, ప్రాంతాల పేర్లపై ఈ అగ్ర రాజ్యాధినేతకు పట్టు ఎలా ఉంటుందన్నది ఆలోచించాల్సిన విషయమే.