నిబంధనల ఉల్లంఘన…..ఇండియాలో ట్విటర్ కు చుక్కెదురు….లీగల్ ప్రొటెక్షన్ రద్దు…..పాటించామంటున్న ‘మాధ్యమం’ ! ఏది నిజం ?

ఇండియాలో ట్విటర్ కు చుక్కెదురైంది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం స్టాట్యుటరీ అధికారులను నియమించడంలో ఇది విఫలమైనందుకు దీనికి లీగల్ ప్రొటెక్షన్ (నాయపరమైన రక్షణ) ను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించింది...

నిబంధనల ఉల్లంఘన.....ఇండియాలో ట్విటర్ కు చుక్కెదురు....లీగల్ ప్రొటెక్షన్ రద్దు.....పాటించామంటున్న 'మాధ్యమం' ! ఏది నిజం ?
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jun 16, 2021 | 10:50 AM

ఇండియాలో ట్విటర్ కు చుక్కెదురైంది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం స్టాట్యుటరీ అధికారులను నియమించడంలో ఇది విఫలమైనందుకు దీనికి లీగల్ ప్రొటెక్షన్ (నాయపరమైన రక్షణ) ను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఇండియాలో కీ ఆఫీసర్లను నియమించాలన్న నూతన సోషల్ మీడియా నిబంధనలను ఇది పాటించలేదని ఐటీ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాము ఈ విషయమై లేఖ రాసినప్పటికీ సరిగా స్పందించలేదని తెలిపింది. అనుచితమైన, అసభ్యకర కంటెంట్ పర్యవేక్షణకు ముఖ్యంగా నోడల్ ఆఫీసర్లను నియమించాలని ఈ శాఖ గతంలోనే కోరింది. అయితే భారత ప్రభుత్వ రూల్స్ ప్రకారం తాము తాత్కాలిక చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్ ను నియమించామని ట్విటర్ నిన్న తెలియజేసింది. కానీ ఇది సందిగ్ధంగా ఉందని ప్రభుత్వం భావించింది. లీగల్ ప్రొటెక్షన్ అంటే..ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద ఈ సామాజిక మాధ్యమంలో కింది స్థాయి ఉద్యోగుల నుంచి హెడ్ వరకు ఎవరు ఏ చట్టాన్ని అతిక్రమించినా వారికి న్యాయపరమైన రక్షణ ఉండదని సైబర్ లా నిపుణుడు ఒకరు చెప్పారు. తన తప్పొప్పులను ట్విటరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అంటే లయబిలిటీల నుంచి సోషల్ మాధ్యమాలకు ఇచ్చే ఇమ్యూనిటీ ..ఇంటర్ మీడియా స్టేటస్ ను తొలగించినట్టే… తాము న్యాయపరమైన అంశాలకు అతీతులమనే వాదనకు ఇక బలం ఉండదు.

ఎవరు (థర్డ్ పార్టీ) దీనిపై కేసు పెట్టినా దీనికి న్యాయపరమైన రక్షణ ఉండదని ఆ నిపుణుడు వివరించారు. వాట్సాప్, గూగుల్, ఫేస్ బుక్ వంటివి దేశంలో చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్ ను, నోడల్ ఆఫీసర్ ను ఇదివరకే నియమించాయి. ఈ అధికారులు భారతీయులే అయి ఉండాలని ఈ సంస్థల ఉద్యోగులు కూడా అయి ఉండాలని ప్రభుత్వం తన నిబంధనల్లో పేర్కొంది. కాగా-తమకు మరింత సమయం కావాలని ట్విటర్ ప్రభుత్వాన్ని కోరింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రశాంత్ నీల్ దర్శకతం లో ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.!:Vijay Sethupathi in Jr NTR video.

 స్వచ్ఛందంగా రక్తదానం చేసిన టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్… ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.:Sachin Donates Blood video.

కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.

యూకే లో డెల్టా వేరియంట్ డేంజర్..మళ్ళీ విజృంభిస్తూన్నా తరుణంలో ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం :Delta Variant Video..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu