పంజాబ్ తరువాత ఇక హర్యానా కాంగ్రెస్ లో ముసలం .. పార్టీ అధిష్టానానికి మరో అగ్ని పరీక్ష !

పంజాబ్ తరువాత ఇక హర్యానా కాంగ్రెస్ లో ముసలం .. పార్టీ అధిష్టానానికి మరో అగ్ని పరీక్ష !
Turmoil In Haryana Congress,kumari Selja,bhupendar Singh Huda,19 Mlas,strong Leadership,k.c.venugopal,

పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభం ఓ వైపు ఇంకా కొనసాగుతుండగానే మరో వైపు హర్యానా కాంగ్రెస్ లో కూడా ముసలం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర శాఖకు గట్టి నాయకత్వం అవసరమని మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా అనుకూల వర్గం కోరుతోంది. ప్రస్తుత చీఫ్ కుమారి సెల్జాను తొలగించి హుడాకు ఈ పదవినివ్వాలని ఈ వర్గం డిమాండ్ చేస్తోంది.

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 05, 2021 | 8:45 PM

పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభం ఓ వైపు ఇంకా కొనసాగుతుండగానే మరో వైపు హర్యానా కాంగ్రెస్ లో కూడా ముసలం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర శాఖకు గట్టి నాయకత్వం అవసరమని మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా అనుకూల వర్గం కోరుతోంది. ప్రస్తుత చీఫ్ కుమారి సెల్జాను తొలగించి హుడాకు ఈ పదవినివ్వాలని ఈ వర్గం డిమాండ్ చేస్తోంది. ఆరేళ్ళ తరువాత పార్టీని పునర్వ్యవస్థీకరిస్తున్న సందర్భంగా వీరు ఈ డిమాండ్లను తెరపైకి తెచ్చారు. తమను సెల్జా పట్టించుకోవడం లేదని, తమ అభిప్రాయాలకు ఆమె విలువనివ్వడం లేదని ఈ వర్గం ఆరోపిస్తోంది. సుమారు 19 మంది ఎమ్మెల్యేలు సోమవారం పార్టీ సీనియర్ నేత కె.సి. వేణుగోపాల్ ను కలిసి తమ డిమాండ్ ను ఆయన వద్ద ప్రస్తావించారు. హర్యానా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జి అయిన వివేక్ బన్సాల్ ను కూడా వీరు ఈ నెల 2 న కలిసి సెల్జా నాయకత్వం పట్ల తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. రాష్ట్ర శాఖ నాయకత్వం మారాల్సిందే అని పట్టు బట్టారు.

గత ఎనిమిదేళ్లుగా పార్టీ జిల్లా శాఖల అధ్యక్షులు లేరని..ఇది పార్టీకి నష్ట దాయకమని వారు పేర్కొన్నారు. అయితే వీరి ఆరోపణలను సెల్జా తేలికగా తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యం లేదని..అందరూ ఐక్యంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. వివేక్ బన్సాల్ ని వీరు కలుసుకోవడంలో ఆశ్చర్యం లేదని..అది వారి హక్కని ఆమె అన్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడైన అశోక్ తన్వర్ స్థానే కుమారి సెల్జా పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ అయ్యారు. అప్పట్లో ఆమె నాయకత్వాన్ని అందరూ ఆమోదించారు. ఏమైనా ఈ కొత్త సంక్షోభాన్ని పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో మరి !

మరిన్ని ఇక్కడ చూడండి: రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్..!సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్ నిలవనున్న అర్జున్ :Arjun in Sarkaru Vaari Paata video.

హీరోయిన్ మెహరీన్‌ల,భవ్య ల ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్ అందుకేనా… ఇంస్టాగ్రామ్ నుండి పోస్టులు డిలీట్ :Mehreen Bhavya Bishnoi video.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల సమీపంలో క్షుద్రపూజల కలకలం..!ఆలస్యంగా వెలుగులోకి వీడియో:Black Magic viral video.

కింగ్ కోబ్రా స్నేక్ సీక్రెట్స్ మీకు తెలుసా..?అత్యంత పొడవైన పాము గురించి ఆసక్తికర విషయాలు..వీడియో :King Cobra Video.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu