మోదీతో వివాదాస్పద చట్టాలపై ఆరా తీయనున్న ట్రంప్ !

దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన  సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీ ఆర్ చట్టాలపై అమెరికా అధ్యక్షుడు ట్రం.. ప్ ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించవచ్చునని తెలుస్తోంది. వచ్ఛే వారం ట్రంప్ ఇండియాను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.

మోదీతో వివాదాస్పద చట్టాలపై ఆరా తీయనున్న ట్రంప్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:40 PM

దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన  సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీ ఆర్ చట్టాలపై అమెరికా అధ్యక్షుడు ట్రం.. ప్ ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించవచ్చునని తెలుస్తోంది. వచ్ఛే వారం ట్రంప్ ఇండియాను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువల పట్ల అమెరికాకు ఎంతో గౌరవం ఉందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. భారత దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలే కాదు.. మతపరమైన స్వేఛ్చ గురించి కూడా ట్రంప్ ప్రయివేటుగా మోదీతో చర్చించే అవకాశాలున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  మత స్వేఛ్చకు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియాలో సీఏఏ మొట్టమొదటిసారిగా మత స్వేఛ్చను ‘పరీక్ష’కు పెట్టినట్టు కనిపిస్తోంది. 2015 కు ముందు పొరుగునఉన్న మూడు దేశాల్లో వివక్షను, వేధింపులను ఎదుర్కొని ఇండియాకు తరలివఛ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించినదే సీఏఏ. అయితే ఇది ముస్లిముల పట్ల వివక్ష చూపేదిగా ఉందని, రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘిస్తోందని విమర్శకులు, ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు. ఏమైనా.. మైనారిటీల హక్కులను పరిరక్షించాలని, ఇతర మతస్థులతో సమానంగా వారిని పరిగణించాలని ట్రంప్.. మోదీని కోరవచ్చు. మత, సాంస్కృతిక అంశాలకు పెట్టింది పేరయిన ఇండియా.. మైనారిటీల హక్కులకు ఎలాంటి భంగం తేబోదనే ట్రంప్ ప్రభుత్వం ఆశిస్తోందని ఆ అధికారి పేర్కొన్నారు.