MLA Ashis Das: అందుకే గుండు గీయించుకున్నా.. బీజేపీని వీడుతూ త్రిపుర ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Tripura MLA Ashis Das Shaves Head: బీజేపీ సీనియ‌ర్ నాయకుడు.. త్రిపుర‌ రాష్ట్రంలోని సుర్మా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఆశిష్‌ దాస్ గుండు గీయించుకున్నారు. రాష్ట్రంలోని

MLA Ashis Das: అందుకే గుండు గీయించుకున్నా.. బీజేపీని వీడుతూ త్రిపుర ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Mla Ashis Das
Follow us

|

Updated on: Oct 06, 2021 | 11:11 AM

Tripura MLA Ashis Das Shaves Head: బీజేపీ సీనియ‌ర్ నాయకుడు.. త్రిపుర‌ రాష్ట్రంలోని సుర్మా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఆశిష్‌ దాస్ గుండు గీయించుకున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ దుర్మార్గాలకు ప్రాయశ్చిత్తంగా తాను గుండు గీయించుకున్నట్లు ఎమ్మెల్యే ఆశిశ్ దాస్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పాల‌న స‌రిగా లేద‌ని, ఆ పార్టీ చేసిన త‌ప్పుల‌కు తాను గుండు గీయించుకున్నానని వెల్లడించారు. ఈ మేరకు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌క‌తాలోని కాళీఘ‌ట్ ఆల‌యం వ‌ద్ద ఆయ‌న త‌న త‌లనీలాల‌ను మంగళవారం అర్పించారు. అనంతరం ఆశిష్ దాస్ మాట్లాడుతూ.. త్రిపుర‌లో బీజేపీ ప్రభుత్వం రాజ‌కీయ అరాచ‌కానికి పాల్పడుతోందని విమర్శించారు. రాజకీయ గంద‌ర‌గోళం సృష్టించి చాలామందిని హింసిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ పాల‌న ప‌ట్ల త్రిపుర ప్రజలు సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు. వీటన్నింటికి ప్రాయశ్చిత్తంగా గుండు గీయించుకొని.. తాను ఆ పార్టీని వీడుతున్నట్లు వివరించారు. బీజీపీ వీడి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనుకుంటున్నానని వివరించారు.

అయితే ఆశిష్ దాస్ త్వరలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల భ‌వానీపూర్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆశిష్ సంతోషం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీని ప్రధానమంత్రి అయితే బాగుటుందని.. చాలామంది ఇదే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో ఆయన పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యే ఆశిశ్.. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్‌ని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు.

Also Read:

Crime News: ఒకరితో ఇద్దరి అక్రమ సంబంధం.. అసలు సంగతి తెలిసి.. కత్తులతో దారుణంగా..

Crime News: తండ్రి అక్రమ సంబంధాలు.. పరువు పోతోందని కొడుకు ఏం చేశాడంటే..?

Crime News: అదృశ్యమైన కాసేపటికే విగతజీవిగా.. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి..

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.