త్రిపుర కాంగ్రెస్ చీఫ్ బిశ్వాస్ కారుపై దాడి, ఘటనలో స్వల్ప గాయాలు, బీజేపీ కార్యర్తల పనేనని ఆరోపణ

త్రిపుర కాంగ్రెస్ చీఫ్ ఫిజుష్ బిశ్వాస్ కారుపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన  స్వల్పంగా గాయపడ్డారు. పాలక పార్టీకి చెందిన బీజేపీ కార్యకర్తలే..

  • Umakanth Rao
  • Publish Date - 2:38 pm, Sun, 17 January 21
త్రిపుర కాంగ్రెస్ చీఫ్ బిశ్వాస్ కారుపై దాడి,  ఘటనలో స్వల్ప గాయాలు, బీజేపీ కార్యర్తల పనేనని ఆరోపణ

త్రిపుర కాంగ్రెస్ చీఫ్ ఫిజుష్ బిశ్వాస్ కారుపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన  స్వల్పంగా గాయపడ్డారు. పాలక పార్టీకి చెందిన బీజేపీ కార్యకర్తలే ఈ  ఎటాక్ కి పాల్పడ్డారని బిశ్వాస్ ఆరోపించారు. పోలీసులు దగ్గరే ఉన్నా ఈ దాడి జరిగిందని, పథకం ప్రకారం బీజేపీ కార్యకర్తలు తనపై హత్యా యత్నానికి దిగారని ఆయన అన్నారు. అగర్తలా నుంచి బిషాల్ ఘర్ లోని తమ పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా తమ వాహనంపై వారు రాళ్లు విసరడంతో కారు అద్దాలు పగిలిపోయి తన సీటులో చెలాచెదరుగా పడినట్టు ఆయన చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. గత డిసెంబరులో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రద్యుత్ దేవ్ వర్మ తరువాత బిశ్వాస్ ఈ పదవిని చేబట్టారు. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా  గవర్నర్ నివాసం వరకు నిర్వహించిన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. త్రిపురలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలే  అసంతృప్తిని వెళ్లగక్కుతున్న నేపథ్యంలో దాన్ని తమ పార్టీ ప్రయోజనాలకు అనువుగా వినియోగించుకోవడానికి బిశ్వాస్ ప్రయత్నిస్తున్నారు.

Also Read:

Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

Telangana Schools Re-Open: ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆ విద్యార్ధులకు కూడా క్లాసులు.? విద్యాశాఖ ప్రాధమిక నిర్ణయం.!

అరుదైన ఘనత సాధించిన భారత సంతతి ప్రొఫెసర్.. అత్యధిక ఫెలోషిప్ అవార్డ్ అందించిన యూఎస్..