Cheating: ఐఏఎస్ అధికారినంటూ 8 మందిని పెళ్లాడిన ట్రాన్స్‌జెండర్.. కట్ చేస్తే కథ వేరే లెవల్లో..

Cheating: కాదేదీ మోసానికి అనర్హం అంటుంటారు. నిజమే.. మోసపోయేవాళ్లున్నంత కాలం.. మోసం చేసేవారు చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ ట్రాన్స్‌జెండర్ 8 మందిని అత్యంత దారుణంగా మోసం చేసింది.

Cheating: ఐఏఎస్ అధికారినంటూ 8 మందిని పెళ్లాడిన ట్రాన్స్‌జెండర్.. కట్ చేస్తే కథ వేరే లెవల్లో..
Cheating
Shiva Prajapati

|

Sep 21, 2022 | 11:35 AM

Cheating: కాదేదీ మోసానికి అనర్హం అంటుంటారు. నిజమే.. మోసపోయేవాళ్లున్నంత కాలం.. మోసం చేసేవారు చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ ట్రాన్స్‌జెండర్ 8 మందిని అత్యంత దారుణంగా మోసం చేసింది. తానో ఐఏఎస్ అధికారిని అంటూ ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. అంతేనా.. వారి నుంచి కోట్లాది రూపాయలు కాజేసింది. ఆమె చేతిలో మోసపోయిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘరానా మోసానికి సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ట్రాన్స్‌జెండర్ బబితా రోజ్.. తనను తాను ఐఎస్ఎస్‌ అధికారిగా చెప్పుకుంది. అలా దాదాపు 15 మంది యువకులను ట్రాప్ చేసింది. వారిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి వారి నుంచి అందినకాడికి దోచుకుంది. తిరుచ్చి, కోయంబత్తూర్, తిరుప్పూర్, మడత్తుకుళం, కడలూరు, కళ్లకుర్చి, విరుదునగర్, రాజపాళయం, నాగర్‌కోయిల్ తదితర ప్రాంతాలలో తాను ఐఏఎస్ అధికారిని అంటూ 8 మందిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కాజేసి పరారయ్యేది. బబిత పెళ్లి చేసుకున్న వారిలో ఉన్నత చదువులు చదువుకున్న వారు, పారిశ్రామికవేత్తలు, పోలీసు అధికారులు సైతం ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. తొలుత విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన బాధితులంతా.. ఇప్పుడు తప్పక పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ సుజిత్ కుమార్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. అ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బబిత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu