Third wave : థర్డ్ కోవిద్ వేవ్ ని నివారించాలంటే..వ్యాక్సినేషన్ జోరు యుద్ధ ప్రాతిపదికన పెరగాల్సిందే..నిపుణుల హెచ్చరిక

Third wave : థర్డ్ కోవిద్ వేవ్ ని నివారించాలంటే..వ్యాక్సినేషన్ జోరు యుద్ధ ప్రాతిపదికన పెరగాల్సిందే..నిపుణుల హెచ్చరిక
Develop Universal Vaccine

థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా నివారించాలంటే యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెంచాల్సిందే అని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు సుమారు 80 లక్షల 60 వేలమందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అడ్మినిస్ట్రేటర్లు, హెల్త్ ప్రొఫెషనల్స్, వ్యాక్సిన్ మేకర్లు కూడా నొక్కి చెబుతున్నారు.

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 06, 2021 | 3:02 PM

థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా నివారించాలంటే యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెంచాల్సిందే అని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు సుమారు 80 లక్షల 60 వేలమందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అడ్మినిస్ట్రేటర్లు, హెల్త్ ప్రొఫెషనల్స్, వ్యాక్సిన్ మేకర్లు కూడా నొక్కి చెబుతున్నారు. కానీ ప్రస్తుతం సాగుతున్న ధోరణి చూస్తే ఆ వేవ్ ని ఎదుర్కోవడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుందని వీరు అంటున్నారు. రోజూ 80 లక్షల 60 వేలమందికైనా టీకామందులు వేస్తేనే కొత్త వేవ్ రాకుండా నిరోధించగలుగుతామన్నది వీరి అభిప్రాయం.. దాన్నే వివిధ మార్గాలుగా వివరిస్తున్నారు. దాదాపు వారం, పది రోజులకు పైగా దేశంలో సుమారు 40 లక్షల మందికి పైగా టీకామందు తీసుకున్నారని అంచనా…గత ఆదివారంనాడయితే మరీ పదిన్నర లక్షల మందికి మించి తీసుకోలేదట.. ఆంక్షలు బాగా సడలిస్తున్న కొద్దీ ఇలా ఒకవిధమైన నిర్లక్ష్యం పెరిగిపోతున్న ధోరణి కనబడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టార్గెట్ 7.1 మిలియన్ పెట్టుకున్నా రోజురోజుకూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ‘బక్క చిక్కి పోతున్నట్టు’వీరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది అంతానికి 18 ఏళ్ళు పైబడినవారికందరికీ మొత్తం 93 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ప్రస్తుతం సాగుతున్న పోకడ చూస్తే దాన్ని సాధించగలుగుతామా అని సందేహిస్తున్నారు. గత 24 గంటల్లో ఇండియాలో 39,796 కేసులు నమోదయ్యాయి. సుమారు 3 నెలల తరువాత ఇది చాలా తక్కువ. కానీ అంతమాత్రాన సంబరపడిపోరాదని ..’ముందున్నది ముసళ్ల పండుగ’ అని వీరు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 35 కోట్ల డోసులకు పైగా టీకామందులు ఇచ్చారు. త్వరలో మోడెర్నా, ఫైజర్ వంటి వ్యాక్సిన్లు కూడా వస్తున్నాయి గనుక సాధ్యమైనంతగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరు పెంచాలని నిపుణులు మరీ మరీ సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : Allu Arha cute video: కుందనపు బొమ్మ లా అర్హ పాప.. నెట్టింట వైరల్ అవుతున్న బన్నీకూతురు క్యూట్ వీడియో.

 ట్రెండ్ మారింది గురు..!పెళ్ళిలో పెట్రోల్ బహుమతి..కొత్త దంపతులకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు..(వీడియో): petrol as wedding gift video.

మెడలో నాగుపాము..సైకిల్ పై సవారీ..చుస్తే షాక్ అవుతారు..!వైరల్ అవుతున్న వీడియో..:snake on neck viral video.

తేలు విషాన్ని చిమ్మడం మీరెప్పుడైనా చూశారా? విషం చిమ్ముతున్న స్లో మోషన్ వైరల్ అవుతున్న వీడియో..:Scorpion video.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu