నుస్రాత్‌ జహాన్‌కు అదనపు భద్రత కల్పించిన విదేశాంగశాఖ

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ , సినీ నటి నుస్రాత్‌ జహాన్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి.. సోషల్‌ మీడియాలో ఆమెను దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారు.. కొందరైతే చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు..

  • Balu
  • Publish Date - 11:22 am, Thu, 1 October 20
నుస్రాత్‌ జహాన్‌కు అదనపు భద్రత కల్పించిన విదేశాంగశాఖ

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ , సినీ నటి నుస్రాత్‌ జహాన్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి.. సోషల్‌ మీడియాలో ఆమెను దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారు.. కొందరైతే చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.. ఈ బెదిరింపులను తట్టుకోలేక రక్షణ కల్పించాలంటూ భారత హై కమిషన్‌కు లేఖ రాశారు నుస్రాత్‌ జహాన్‌.. లేఖతో పాటు తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధిచిన స్క్రీన్‌ షాట్లను కూడా జత చేశారు.. ఓ బెంగాలీ సినిమా షూటింగ్‌ కోసం లండన్‌కు వెళ్లిన ఆమెను అక్కడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు నెటిజనులు.. దుర్గా దేవత రూపంలో మహిషాసురమర్ధినిలా త్రిశూలం పట్టుకుని తీసిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన తర్వాత బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయి.. నుస్రాత్‌ లేఖకు స్పందించిన విదేశాంగశాఖ ఆమెకు అదనపు భద్రత కల్పించింది.. నుదుట సిందూరం ధరించినందుకు ఇంతకు ముందు కూడా ఆమెను కొందరు ముస్లింలు ట్రోల్‌ చేశారు..