ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘జైశ్రీరామ్’ నినాదాలా ? టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ మండిపాటు, ఇది పొలిటికల్ కార్యక్రమం కాదని ఫైర్

ప్రభుత్వ కార్యక్రమాల్లోకొందరు 'జై శ్రీరామ్' అని నినాదాలు చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తీవ్రంగా దుయ్యబట్టారు..

ప్రభుత్వ కార్యక్రమాల్లో 'జైశ్రీరామ్' నినాదాలా ? టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ మండిపాటు, ఇది పొలిటికల్ కార్యక్రమం కాదని ఫైర్
TMC MP Nusrat Jahan
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 11:56 AM

ప్రభుత్వ కార్యక్రమాల్లోకొందరు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తీవ్రంగా దుయ్యబట్టారు. శనివారం కోల్ కతా లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ ప్రసంగించడానికి రాగానే కొందరు ఇలా నినాదాలు చేయడం, మోడీ, మోడీ అని స్లోగన్స్ ఇఛ్చిన సంగతి తెలిసిందే. దీంతో మమతా తీవ్ర అసహనానికి గురై మాట్లాడేందుకు నిరాకరించారు. తనను అవమానపరిచారని ఫీలయ్యారు. దీనిపై స్పందించిన నుస్రత్ జహాన్.. ఈ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో కొంత డిగ్నిటీ అన్నది ఉండాలని, ఇది రాజకీయ కార్యక్రమం కాదని ట్వీట్ చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఆమెను ఇన్సల్ట్ చేయడం సముచితం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం దీదీ స్పీచ్ ఇచ్చేందుకు రాగానే ఇలా జరగడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మమతా బెనర్జీ కూడా మధ్యలోనే తన ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది.