ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్.. సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం..

Uttarakhand New CM: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం..

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్.. సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం..
Follow us

|

Updated on: Mar 10, 2021 | 11:59 AM

Uttarakhand New CM: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టనున్నారు. 56 ఏళ్ల తిరథ్ సింగ్ రావత్.. 2013-15 మధ్య ఉత్తరాఖండ్‌లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రాష్ట్ర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కేంద్ర మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిషాంక్, ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్‌ తదితరుల పేర్లను పరిశీలించిన అనంతరం సీఎం పదవిని తీరత్‌కు ఇవ్వాలని బీజేపీ పార్టీ నిర్ణయించింది. మంగళవారం డెహ్రాడూన్‌లో పార్టీ లెజిస్లేచర్ మీటింగ్‌లో పాల్గొన్న పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పనితీరు సరిగా లేని కారణంగా రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్లు రావడంతో మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ సాయంత్రం 4 గంటలకు తీరత్ ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.