బ్రేకింగ్: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జమ్ము కశ్మీర్‌ పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులు ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.....

  • Updated On - 12:53 pm, Wed, 3 June 20 Edited By:
బ్రేకింగ్: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జమ్ము కశ్మీర్‌ పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులు ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. జవాన్లు ధీటుగా స్పందించారు. దీంతో పోలీసుల, ముష్కరుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలను సేకరించగా.. ఈ ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారని గుర్తించారు. వారిలో ఒక ఐఈడీ నిపుణులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

Read More:

కరోనాతో మాజీ క్రికెటర్ మృతి

గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం.. తృటిలో తప్పింది..

సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత