హత్రాస్ కుటుంబానికి మూడంచెల భద్రత

హత్రాస్ కుటుంబానికి యూపీ ప్రభుత్వం మూడంచెల భద్రతను కల్పించింది. 24 గంటలూ సెక్యూరిటీతో బాటు ఆ ఫ్యామిలీ ఇంటి బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఆరుగురు మహిళా పోలీసులను..

హత్రాస్ కుటుంబానికి మూడంచెల భద్రత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 07, 2020 | 8:20 PM

హత్రాస్ కుటుంబానికి యూపీ ప్రభుత్వం మూడంచెల భద్రతను కల్పించింది. 24 గంటలూ సెక్యూరిటీతో బాటు ఆ ఫ్యామిలీ ఇంటి బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఆరుగురు మహిళా పోలీసులను నియమిస్తున్నామని, అలాగే ఆ గ్రామ పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తామని, గ్రామానికి ఎవరు వఛ్చినా, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఎవరు కలుసుకోగోరినా అక్కడ ఓ రిజిస్టర్ ని ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. గ్రామంలో కొత్తగా మరో ఇద్దరు ఇన్స్ పెక్టర్లను, సబ్ ఇన్స్పెక్టర్లను, పోలీసులను నియమిస్తున్నట్టు వారు చెప్పారు. తమకు భద్రత కల్పించాలని హత్రాస్ కుటుంబం ఇదివరకే ప్రభుత్వాన్ని కోరింది.