అది ‘పొలిటికల్ గా మారిపోయింది’, సుశాంత్ కేసుపై బిహార్ డీజీపీ

సుశాంత్ సింగ్ కేసు పొలిటికల్ గా మారిపోయిందని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యానించారు. ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుందని తాము భావించలేదని, ఇప్పుడిది రాజకీయ కేసుగా మారిందని..

అది 'పొలిటికల్ గా మారిపోయింది', సుశాంత్ కేసుపై బిహార్ డీజీపీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2020 | 2:33 PM

సుశాంత్ సింగ్ కేసు పొలిటికల్ గా మారిపోయిందని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యానించారు. ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుందని తాము భావించలేదని, ఇప్పుడిది రాజకీయ కేసుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సుశాంత్ తండ్రి తమ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదును పురస్కరించుకుని నలుగురు పోలీసుల బృందం పాట్నా నుంచి ముంబై వెళ్లారని, కానీ వారం రోజలవరకు కూడా అక్కడి పోలీసుల్లో ఎవరూ అసలిది ఏ పోలీసు స్టేషన్ పరిధికిందికి వస్తుందో కూడా చెప్పలేదని ఆయన అన్నారు, పైగా మా పోలీసు అధికారుల్లో ఒకరిని బలవంతంగా క్వారంటైన్ కి తరలించారన్నారు. ఈ కేసులో తాము 10 మందిని విచారించామని, కానీమెడికో లీగల్ సాక్ష్యాధారాలు గానీ, సీసీటీవీ ఫుటేజీగానీ తమవద్ద లేవని ఆయన చెప్పారు.

సుశాంత్ కేసు బీహార్ పోలీసులు దర్యాప్తు చేయడాన్ని ముంబై ఖాకీలు వ్యతిరేకిస్తుండగా ఇది రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ కేసుగా  మారిపోయింది. బీహార్ సర్కార్ ఈ కేసులో జోక్యం చేసుకోజాలదని శివసేన నేత సంజయ్ రౌత్ అంటుండగా.. సుశాంత్ ది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ హత్యేనని బీజేపీ నేత నారాయణ్ రాణే చెబుతున్నారు. మరో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆ మధ్య ప్రధాని మోదీకి రాసిన లేఖలో…. దీనిపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ కి ఆదేశించాలని కోరారు.