విప్రో కొత్త సీఈవో వేత‌నం ఎంతో తెలుసా..?

 బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో కొత్త సీఈవో వేత‌నం ఎంతో తెలుసా..? అత్య‌ధిక వేత‌నం అందుకునే సీఈవోగా విప్రో కొత్త సీఈవో థియెరీ డెలాపోర్ట్ నిల‌వ‌నున్నారు....

విప్రో కొత్త సీఈవో వేత‌నం ఎంతో తెలుసా..?
Jyothi Gadda

|

Jun 20, 2020 | 7:52 PM

బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో కొత్త సీఈవో వేత‌నం ఎంతో తెలుసా..? అత్య‌ధిక వేత‌నం అందుకునే సీఈవోగా విప్రో కొత్త సీఈవో థియెరీ డెలాపోర్ట్ నిల‌వ‌నున్నారు. ఈ ఏడాది రూ.50 కోట్ల వేత‌నాన్ని ఆయ‌న పొంద‌నున్న‌ట్లు కంపెనీ ఫైలింగ్ లో విప్రో వెల్ల‌డించింది. టీసీఎస్ సీఈవో అందుకునే వార్షిక వేత‌నం కన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ‌ని తెలుస్తోంది. జూలై 6 నుండి సీఈవో, ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న థియెరీ 2025 వ‌ర‌కు విప్రో సీఈవోగా కొనసాగ‌నున్నారు.

ఇక థియెరీ గతంలో క్యాప్‌జెమినీ సీవోవోగా, గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ సభ్యుడిగా, గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్ట్రటజిక్‌ బిజినెస్‌ యూనిట్‌, గ్లోబల్‌ సర్వీస్‌ లైన్స్‌ అధినేతగా బాధ్యతలు నిర్వహించారు. క్యాప్‌జెమినీతో అత‌నికి రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్నది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu