Cable Bridge Collapse: వంద మంది జలసమాధికి కారణం వీరేనా.. వంతన తెగిపోయే కొన్ని క్షణాల ముందు వీరు ఏం చేశారో చూడండి..

గుజరాత్ బ్రిడ్జి విషాదంలో తిలా పాపం తలా పిడికెడు పంచేసుకున్నారు. ఇంతకూ తప్పెక్కడ జరిగింది. ప్రమాదం ముందు కొందరు ఆకతాయిలు బ్రిడ్జిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారా..అదే ఈ ఘోర విషాదానికి కారణమయ్యిందా..?

Cable Bridge Collapse: వంద మంది జలసమాధికి కారణం వీరేనా.. వంతన తెగిపోయే కొన్ని క్షణాల ముందు వీరు ఏం చేశారో చూడండి..
Cable Bridge
Follow us

|

Updated on: Oct 31, 2022 | 10:46 AM

ఫిట్‌నెస్‌ లేని బ్రిడ్జి.. వందలమంది సందర్శకుల రాక. కంట్రోల్ చేయాల్సిన నిర్వాహకులు పట్టించుకోలేదు. ప్రాపర్‌గా చెక్‌ చేసి అప్రూవల్ చేయాల్సిన విభాగం నిర్లక్ష్యం వహించింది దాని ఫలితం ..వందమందికిపైగా ప్రాణాలు జలసమాధి కావడం. గుజరాత్ బ్రిడ్జి విషాదంలో తిలా పాపం తలా పిడికెడు పంచేసుకున్నారు. ఇంతకూ తప్పెక్కడ జరిగింది. ప్రమాదం ముందు కొందరు ఆకతాయిలు బ్రిడ్జిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారా..అదే ఈ ఘోర విషాదానికి కారణమయ్యిందా..? గుజరాత్‌ మోర్బీలో మచ్చు నదిపై కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 130 మందికి పైగా జలసమాధి అయ్యారు. వంద మందికి పైగా గాయపడ్డారు. కెపాసిటీకి మించి బ్రిడ్జ్‌కి పైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది.

100 మంది కెపాసిటీ ఉన్న వంతెనపైకి 400మంది ఒక్కసారిగా రాడంతో వంతెనే కూలినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది ఈత కొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. చాలా మంది వంతెనలో ఇరుక్కుపోయారు. వారిని సహాయక సిబ్బంది సురక్షతంగా బయటకు తీశారు. ఇప్పటి వరకూ దాదాపు 117 మందికి పైగా కాపాడినట్టు సహాయక బృందాలు వెల్లడించాయి. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నారు.

అయితే బ్రిడ్జి కూలిపోయే కొంత సమయం ముందు తీసిన వీడియోలో కొన్ని సంచలన దృశ్యాలు కనిపించాయి. వంతెనను విపరీతంగా ఊపడంతో పాటు ఎగిరెగిరి దూకారు. కేబుళ్లను కాళ్లతో తన్నారు. కేబుల్ బ్రిడ్జ్‌కు దూరంగా ఉన్నవారు చిత్రీకరించిన దృశ్యాల్లో ఇది రికార్డైంది. కొందరు ఆకతాయిల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తమౌతోంది. అల్లరిమూకల చేష్టలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జాతీయ మీడియా సంస్థలు పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

అల్లరిమూకల నిర్వాకంపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఓ గ్రూప్‌గా వచ్చిన కొందరు యువకులు కేబుల్ బ్రిడ్జిని ద్వంసం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అసలు వారు ఎవరు..? ఎందుకు అలా చేస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్న..? అయితే జాతీయ మీడియా చూపిస్తున్న వీడియో కొత్తదా..? పాతదా..? అనేది తెలియాలి. వీడియో కొత్తదైనా.. పాతదైనా ఇలా తప్పుగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఆదివారం అందులో రీపైర్ చేసి 4 రోజులు కావడం తో ఎక్కువ మంది ప్రజలు బ్రిడ్జి మీదకు రావడం వళ్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని అక్కడి పోలీస్ ల ప్రాథమిక సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం