Coal Stock: దేశంలో తగ్గిన బొగ్గు కొరత.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో పెరిగిన నిల్వలు

దేశంలో బొగ్గు కొరత కాస్త తగ్గుముఖం పట్టింది. అనేక రాష్ట్రాల్లోని విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు తగ్గిపోటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సంక్షోభం దిశగా వెళ్తున్న క్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(CEA) శుభవార్త తెలిపింది. థర్మల్ ప్రాజెక్టులలో పొడి ఇంధన నిల్వ పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డేటా ప్రకారం ఒక వారం క్రితం.. నాలుగు రోజుల వరకు బొగ్గు నిల్వలున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు 69 ఉండగా […]

Coal Stock: దేశంలో తగ్గిన బొగ్గు కొరత.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో పెరిగిన నిల్వలు
Coal
Follow us

|

Updated on: Oct 20, 2021 | 7:01 AM

దేశంలో బొగ్గు కొరత కాస్త తగ్గుముఖం పట్టింది. అనేక రాష్ట్రాల్లోని విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు తగ్గిపోటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సంక్షోభం దిశగా వెళ్తున్న క్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(CEA) శుభవార్త తెలిపింది. థర్మల్ ప్రాజెక్టులలో పొడి ఇంధన నిల్వ పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డేటా ప్రకారం ఒక వారం క్రితం.. నాలుగు రోజుల వరకు బొగ్గు నిల్వలున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు 69 ఉండగా అక్టోబర్ 18 నాటికి 58కి తగ్గాయి. ఈ నెల ప్రారంభంలో పంజాబ్, గుజరాత్‌తో సహా ఆరు రాష్ట్రాలు తమ పవర్ ప్లాంట్లలో చాలా వరకు కేవలం నాలుగు రోజుల బొగ్గు మాత్రమే మిగిలి ఉందని, ఇది అంతరాయాలకు దారితీస్తుందని కేంద్రానికి తెలిపింది.

ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్‌తో సరఫరా పెంచాలని నిర్ణయించింది. కోల్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు, సరఫరాదారుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పొడి ఇంధన ఉత్పత్తి జరిగినప్పటికీ, సుదీర్ఘ రుతుపవనాలు ప్లాంట్లకు సరఫరాను దెబ్బతీశాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ దేశంలో విద్యుత్ సంక్షోభం గురించి మాట్లాడే అన్ని విషయాలను తోసిపుచ్చారు. విద్యుత్ ప్లాంట్లతో బొగ్గు తగినంత నిల్వలు తగ్గలేదని చెప్పారు. గత రెండు వారాల నుంచి ప్రభుత్వం క్రమం తప్పకుండా బొగ్గు ఉత్పత్తిని, విద్యుత్ ప్లాంట్‌లకు సరఫరాను క్రమం తప్పకుండా పరిశీలిస్తోందని తెలిపారు. సోమవారం CEA నాలుగు రోజుల కన్నా తక్కువ బొగ్గు కలిగిన నాన్-పిట్ హెడ్ ప్రాజెక్టుల సంఖ్య అక్టోబర్ 11న 69 తో పోలిస్తే అక్టోబర్ 18 న 58కు తగ్గినట్లు పేర్కొంది. బొగ్గు కొరతతో పంజాబ్‎లోని పలు థర్మల్ విద్యుత్ ప్లాంట్లు మూసివేశారు. దీంతో అక్కడ విద్యుత్ తగ్గిపోవడంతో కరెంటు కోతలు విధించారు.

Read Also.. Viral Video: చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న నది.. చాలా తెలివిగా ప్రాణాలు దక్కించుకున్న ఏనుగు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!