మెలనియా డ్రెస్ లో ‘దేశీ టచ్’ చూడాల్సిందే..!

యుఎస్ ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ సోమవారం తన భారత పర్యటన సందర్భంగా 'ప్రిస్టిన్ వైట్ ఔట్ ఫిట్' లో ఈ గడ్డ మీద అడుగు పెట్టారు. ఈ డ్రెస్ తో బాటు నడుముకు లైట్ కలర్ గ్రీన్ రుమాల్ వంటి వస్త్రాన్నికట్టుకున్నారు.

మెలనియా డ్రెస్ లో 'దేశీ టచ్' చూడాల్సిందే..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 24, 2020 | 6:19 PM

యుఎస్ ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ సోమవారం తన భారత పర్యటన సందర్భంగా ‘ప్రిస్టిన్ వైట్ ఔట్ ఫిట్’ లో ఈ గడ్డ మీద అడుగు పెట్టారు. ఈ డ్రెస్ తో బాటు నడుముకు లైట్ కలర్ గ్రీన్ రుమాల్ వంటి వస్త్రాన్నికట్టుకున్నారు. మాజీ మోడల్ అయిన ఈమె.. మొదటిసారి ఈ దేశాన్ని విజిట్ చేసినప్పుడు  ఇండియన్ డిజైన్ (దేశీ టచ్) తో కూడిన ఈ పీస్ ను కట్టుకోవడం విశేషం. ఫ్రెంచ్-అమెరికన్ డిజైనర్ అయిన హార్వే పియెర్రీ కొన్ని సందర్భాల్లో మెలనియాకు స్టైలిష్ డిజైనర్ గా వ్యవహరిస్తుంటారట. ఈ లైట్ గ్రీన్ గోల్డ్ పీస్ గురించి ఆయన వివరిస్తూ.. పారిస్ లో తాను ’20 వ శతాబ్ద ఆరంభంలో ఇండియన్ టెక్స్ టైల్ డాక్యుమెంట్ల’ ను విశ్లేషించినప్పుడు దీని గురించి తెలుసుకున్నానన్నారు. గ్రీన్ సిల్క్, గోల్డ్ మెటలిక్ థ్రెడ్ తో దీన్ని రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా.. అనేక ఫంక్షన్లు, ఈవెంట్లు, కార్యక్రమాలకు మెలనియా హాజరైనప్పుడు తెల్లని డ్రెస్ నే ప్రిఫర్ చేయడం విశేషం.