Strain Virus: భారత్‌లో పెరుగుతున్న స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న కేంద్ర ఆరోగ్యశాఖ

Strain Virus: ఒక వైపు మరోనా వైరస్‌.. మరో వైపు స్ట్రెయిన్‌ వైరస్‌. ముందే కరోనాతో దేశాలు అతలాకుతలం అవుతుంటే ఈ కొత్తరకం కరోనా వైరస్‌ వల్ల మరింత భయాందోళన..

Strain Virus: భారత్‌లో పెరుగుతున్న స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న కేంద్ర ఆరోగ్యశాఖ
Follow us

|

Updated on: Jan 16, 2021 | 4:15 PM

Strain Virus: ఒక వైపు మరోనా వైరస్‌.. మరో వైపు స్ట్రెయిన్‌ వైరస్‌. ముందే కరోనాతో దేశాలు అతలాకుతలం అవుతుంటే ఈ కొత్తరకం కరోనా వైరస్‌ వల్ల మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఏడాది నుంచి కరోనా మహమ్మారి దేశ విదేశాల్లో కల్లోలం సృష్టిస్తుంటే తాజాగా బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త రకం వైరస్‌ ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ భారత్‌లో మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. తాజాగా భారత్‌లో ఇప్పటి వరకు ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు 116కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్నటి వరకు 114 స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు నమోదు కాగా, తాజాగా మరో రెండు కేసులతో మొత్తం 116కు చేరినట్లు తెలిపింది.

కాగా, బ్రిటన్‌లో ఈ రకం వైరస్‌ వెలుగు చూసిన వెంటనే భారత్‌ అప్రమత్తమైంది. ఆ దేశానికి కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆ తర్వాత జనవరి 8 నుంచి తిరిగి విమాన సేవలు ప్రారంభించినప్పటికీ, యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో కరోనా పాజిటివ్‌ తేలిన వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. అలా ఇప్పటి వరకు 116 మందికి స్ట్రెయిన్‌ సోకగా, ప్రస్తుతం వారంతా ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇక వారితో కాంటాక్ట్‌ ఉన్నవారిని గుర్తించే పనిలో ఉంది కేంద్రం.

అయితే రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్స్‌ గడగడలాడిస్తున్నాయి. బ్రిటన్‌ వేరియంట్‌తోనే సతమతమవుతుండగా.. సౌతాఫ్రికా మ్యుటేషన్‌ కూడా దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రిటన్‌ వేరియంట్‌ కంటే ఈ రకం వైరస్‌ మరింత ప్రమాదకరమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కరోనాను అడ్డుకునే యాంటీబాడీస్‌ను కూడా ఈ కొత్త వేరియంట్‌ తట్టుకుంటుందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతమున్న వ్యాక్సిన్స్‌ ఈ న్యూ స్ట్రెయిన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, అమెరికాలో రూపం మార్చుకున్న మహమ్మారిని గుర్తించారు. తాజాగా జపాన్‌లో వీటన్నింటికీ భిన్నమైన మరో వైరస్‌ను నిర్ధారించారు. కోవిడ్ 19 తో పోలిస్తే స్ట్రెయిట్ 70శాతం వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచదేశాలు బ్రిటన్‌ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే బ్రిటన్‌ , దక్షిణ ఆఫ్రికా లో పుట్టిన కొత్త రకం వైరస్‌ లు కాకుండా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటిచింది.

వేగంగా విస్తరిస్తున్న స్ట్రెయిట్ వైరస్ బాధితులు భారత్ లో కూడా రోజు రోజుకీ అధికమవుతున్నారని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ బారిన పడిన వారందరూ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచుతున్నామని కేంద్రం చెప్పింది.

Also Read:

బ్రెజిల్ స్ట్రెయిన్ వైరస్‌తో ఇండియాలో ఆందోళన, నిపుణుల విశ్లేషణ, చైనా వైరస్‌తో పోలిక, ముమ్మరమైన రీసెర్చ్

PM Narendra Modi: ట్విట్టర్ యూజర్ ప్రశ్న.. అది నాకు తెలుసు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రిప్లై.. ఏం సమాధానం చెప్పారంటే..

238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్