Crime: కదిలే రైలు నుంచి తోసేశారు.. ఆ విషయంలో తలెత్తిన గొడవ.. చివరికి

వాటర్‌ బాటిల్‌ విషయంలో చెలరేగిన గొడవ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. రైల్వే ప్యాంట్రీ (Pantry Staff) అనాలోచిత చర్యకు ఓ వ్యక్తి ఆస్పత్రిపాలయ్యాడు. పాన్ మసాలా ఉమ్మేశాడంటూ మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారి ప్రాణాల పైకే తీసుకొచ్చింది....

Crime: కదిలే రైలు నుంచి తోసేశారు.. ఆ విషయంలో తలెత్తిన గొడవ.. చివరికి
Railway Track
Follow us

|

Updated on: Aug 08, 2022 | 9:51 PM

వాటర్‌ బాటిల్‌ విషయంలో చెలరేగిన గొడవ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. రైల్వే ప్యాంట్రీ (Pantry Staff) అనాలోచిత చర్యకు ఓ వ్యక్తి ఆస్పత్రిపాలయ్యాడు. పాన్ మసాలా ఉమ్మేశాడంటూ మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారి ప్రాణాల పైకే తీసుకొచ్చింది. కోపంలో రైల్వే సిబ్బంది సదరు వ్యక్తిని కదులుతున్న రైలు లో నుంచి తోసేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రవి యాదవ్‌.. అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో జర్నీ చేస్తున్నాడు. రైలు జిరోలి దగ్గరకు చేరుకోగానే అతనికి ప్యాంట్రీ స్టాఫ్‌తో గొడవ జరిగింది. వాటర్‌ బాటిల్‌ కొనుగోలుతో మొదలైన ఈ గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రైలులో పాన్‌ మసాలా ఉమ్మేశారనే కారణంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో రైలు రవియాదవ్ దిగాల్సిన చోటుకు అంటే లలిత్ పుర్ (Lalitpur) కు చేరుకుంది. అయితే లలిత్ పుర్ స్టేషన్ లో రవి యాదవ్ ను దించేసిన సిబ్బంది.. అతడు మాత్రం దిగకుండా ఈ తరుణంలో లలిత్‌పూర్‌ స్టేషన్‌ దగ్గర రవి యాదవ్‌ సోదరిని సిబ్బంది దించేశారు. అయితే అతన్ని మాత్రం దిగకుండా అడ్డుకున్నారు.

ఆ క్రమంలోనే రైలు కదిలింది. రవిని బలవంతంగా రైలు దిగనీయకుండా పట్టుకుని దాడి చేశారు. అనంతరం అతన్ని పట్టాలపై పడేశారు. గమనించిన స్థానికులు రవిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు.. రవి ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడని, భయపడాల్సిందేమీ లేదని చెప్పడంతో అతని కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఝాన్సీ పోలీసులు.. ప్యాంట్రీ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??