దేశ భద్రతే ప్రథమ కర్తవ్యం: నిర్మలా

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యమన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ప్రస్తావిస్తూ.. రోగ రహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత ముఖ్యమన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయమైన జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు నిర్మలా సీతారామన్. కాగా.. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి గృహ […]

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యం: నిర్మలా

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యమన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ప్రస్తావిస్తూ.. రోగ రహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత ముఖ్యమన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయమైన జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు నిర్మలా సీతారామన్.

కాగా.. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి గృహ ఆవాస యోజన పథకంతో దేశ వ్యాప్తంగా ప్రజలకు గృహ వసతి లభించిందన్నారు. కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుగా మారినట్లు ఆమె తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినట్లు చెప్పినట్లు ఆమె.. ఈ బడ్జెట్ సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటుందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ పదాన్ని పదేపదే ప్రస్థావించిన నిర్మలా.. మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలను గుర్తు చేశారు.

Published On - 1:17 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu