అన్నీ కట్టుకథలు, అబధ్ధాలు చెప్పాడు, రైతు సంఘాల నేతలు ప్రవేశపెట్టిన యువకుని తీరుపై పోలీసుల వెల్లడి

నలుగురు రైతు సంఘాల నేతలపై కాల్పులు జరిపేందుకు , ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకునేందుకు కుట్ర  పన్నాడన్న ఆరోపణలపై రైతు నాయకులు..

అన్నీ కట్టుకథలు, అబధ్ధాలు చెప్పాడు, రైతు సంఘాల నేతలు ప్రవేశపెట్టిన యువకుని తీరుపై పోలీసుల వెల్లడి
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Jan 24, 2021 | 9:24 AM

నలుగురు రైతు సంఘాల నేతలపై కాల్పులు జరిపేందుకు , ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకునేందుకు కుట్ర  పన్నాడన్న ఆరోపణలపై రైతు నాయకులు  మీడియా ముందు ప్రవేశపెట్టిన యువకుని ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యక్తి అన్నీ కట్టుకథలు, అబధ్ధాలు చెప్పాడని హర్యానా పోలీసులు తెలిపారు. ఇతనికి నేర చరిత్ర ఏదీ లేదని, ఇతని తండ్రి కుక్ కాగా తల్లి ఇళ్లల్లో పనిమనిషి అని తెలిసిందని వారు చెప్పారు. ప్రదీప్ అనే పోలీసు అధికారి.. ఈ కుట్రకు దిగాలని తనతో చెప్పాడని ఈ యోగేష్ అనే వ్యక్తి తెలిపాడని, కానీ అసలు ప్రదీప్ అనే ఎస్ ఐ ఎవరూ లేరని తెలిసిందన్నారు. లాక్ డౌన్ సమయంలో ఇతని జాబ్ పోయిందన్నారు. ఈవ్ టీజింగ్ చేస్తున్న ఇతడిని రైతు వాలంటీర్లు పట్టుకుని కొట్టారన్నారు. దాంతో బహుశా యోగేష్ ఇంత కథ నడిపించినట్టు అనుమానిస్తున్నామన్నారు. పైగా ఈ నెల మొదటివారంలో కర్నాల్ లో జరిగిన  సీఎం ర్యాలీలో పాల్గొన్నట్టు యోగేష్ చెప్పాడని, కానీ ఆరా తీస్తే అది అబధ్ధమని తేలిందని పోలీసులు చెప్పారు. భయంతో ఇలా చెప్పానని ఇతగాడు అన్నాడని వారు పేర్కొన్నారు. మొత్తానికి ఈ యువకుని వ్యవహారం ఢిల్లీ సింఘు బోర్డర్ లో సంచలనం సృష్టించింది.

Also Read:

Sonu Sood : మరోసారి గొప్పమనసు చాటుకున్న రియల్ హీరో.. చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన సోనూసూద్..

టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీ సెమీస్‌ పోరాడి ఓడిన సాత్విక్‌-చిరాగ్ జోడి..

Anand Mahindra : ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరిసిన యువ ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్‌‌లను ఆఫర్ చేసిన ఆనంద్ మహేంద్ర..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu