నాకు సొంత కారు కూడా లేదు.. నా ఆస్తులు ఇవే..!

నాకు సొంత కారు కూడా లేదు.. నా ఆస్తులు ఇవే..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు సొంతంగా కారు కూడా లేదంటూ పేర్కొన్నారు. తన కుటుంబ ఆస్తి మొత్తం విలువ కూడా.. రూ.143 కోట్లేనంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ఉద్దవ్.. తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. తనకు సొంతంగా కారు లేదని.. స్పష్టం చేశారు. తన […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 12, 2020 | 1:31 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు సొంతంగా కారు కూడా లేదంటూ పేర్కొన్నారు. తన కుటుంబ ఆస్తి మొత్తం విలువ కూడా.. రూ.143 కోట్లేనంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ఉద్దవ్.. తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. తనకు సొంతంగా కారు లేదని.. స్పష్టం చేశారు. తన భార్య రష్మీ థాక్రే శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తోందని.. అంతేకాకుండా ఆమెకు పలు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్యకు  వడ్డీలతో పాటు, రెంట్లు, షేర్ల ద్వారా కూడా లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. డివిడెంట్ల ద్వారా కూడా ఆదాయం వస్తుందని.. అయితే ఆమెకు రూ.11.44 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. తనతో పాటుగా తన కుటుంబానికి కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.143.26 కోట్లు అని.. వీటిలో రూ.76.56 కోట్లు తన పేరుపై ఉండగా.. మరో రూ.52.44 కోట్లు తన భార్య రష్మీ థాక్రే పేరు మీద ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. రూ.4.06 కోట్ల రుణంతోపాటుగా.. రూ.15.50 కోట్ల అప్పులు కూడా ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి వరకు తనపై మొత్తం 23 కేసులు ఉన్నాయని.. వీటిలో దాదాపు 14 కేసులు సామ్నా పత్రికలో గీసిన కార్టూన్లు, ఆర్టికల్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నమోదైనవంటూ తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu