తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటూ హితవు పలికారు.
‘‘మేడమ్.. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మీరు, ఏదైనా మాట్లాడేముందు అసలు విషయాలను తెలుసుకోండి. కేసీఆర్ గారు ఎప్పుడూ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కొన్ని మీడియా సంస్థలు, వాటి టీఆర్పీ రేటింగ్‌ను పెంచుకోవడం కోసం ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చేస్తున్నాయి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Madam, you’re in an extremely important position & I request you to kindly do a fact check before reacting. Hon’ble @TelanganaCMO has NOT made any such statement
Unfortunately some irresponsible media outlets, in their pursuit for TRP ratings have been spreading sheer Nonsense https://t.co/4fBmoxo9M0
— KTR (@KTRTRS) December 2, 2019
కాగా ఆదివారం ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన సీఎం కేసీఆర్ వారితో మాట్లాడుతూ.. ‘‘మహిళా ఉద్యోగులు 8 గంటలలోపే విధులు ముగించుకునేలా డ్యూటీ చార్ట్‌లు చేయండి. 50వేల మంది ఉన్న ఆర్టీసీ కార్మికుల్లో 5వేల మంది కూడా మహిళలు లేరని.. వారికి ఇబ్బంది కలగకుండా మనం చూసుకోలేమా..? మన ఆడబిడ్డలను మనం కాపాడుకుందాం’’ అని అధికారులకు సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అవాస్తవాలు ప్రచారం చేసిన నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ స్పందించారు.
‘‘8గంటల లోపు మహిళలు ఇంట్లో ఉండండి అని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నన్ను షాక్‌కు గురి చేశాయి. మహిళలు తమను తాము రక్షించుకోవడం కోసం జీవితాంతం ఖైదీలుగా బ్రతకాలా..? ఇంట్లో ఉన్నా నేరాలు జరగడం లేదా..? బహిరంగ ప్రదేశాల్లో ఉండే స్వేచ్ఛ మహిళలకు కూడా ఉంది. దీనిపై సీఎంకు కచ్చితంగా గుణపాఠం చెప్తాం’’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.