Principal Suspended: ప్రభుత్వ పాఠశాలలో కులం పేరుతో ప్రిన్సిపల్‌ వేధింపులు .. సస్పెండ్‌ చేసిన అధికారులు

Principal Suspended: తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ గీత గత కొన్ని రోజులుగా స్కూల్ లో బాత్రూంలను విద్యార్థినిలు కడుగుతుండడం..

Principal Suspended: ప్రభుత్వ పాఠశాలలో కులం పేరుతో ప్రిన్సిపల్‌ వేధింపులు .. సస్పెండ్‌ చేసిన అధికారులు
Follow us

|

Updated on: Dec 19, 2021 | 3:44 PM

Principal Suspended: తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ గీత గత కొన్ని రోజులుగా స్కూల్ లో బాత్రూంలను విద్యార్థినిలు కడుగుతుండడం తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ పనులను విద్యార్థులతో చేయిస్తుండటమే కాకుండా దళితులు చదువుకోవడానికి పనికిరారు అని మీకు చదువు ఎందుకని , మీరు తక్కువ జాతి వారని ప్రిన్సిపాల్ గీత దుర్భాషలాడేవారని విద్యార్థులు తల్లితండ్రులకు ఫిర్యాదు చేశారు.

తల్లితండ్రుల ఫిర్యాదుతో అధికారులు పాఠశాలలో జరుగుతున్న విషయాలపై నేరుగా పాఠశాలకు వెళ్లి విచారించారు. అగ్రవర్ణాలకు చెందిన ప్రిన్సిపాల్ గీత స్కూల్ పిల్లలను కులం పేరుతో దూషించి వారిని హింసిస్తున్నారని విద్యార్థులకు అధికారుల విచారణలో తెలిపారు. రోజు తమను కులం పేరుతో దూషిస్తూ, బాత్‌రూమ్‌లను కడిగిస్తున్నారని అధికారుల ముందు విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. విచారణ అనంతరం ప్రిన్సిపాల్ గీతని విధుల నుండి తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి:

Case on PT Usha: పరుగుల రాణి పిటి ఉషపై కేసు నమోదు చేసిన కోజికోడ్ పోలీసులు.. ఎందుకోసమంటే..?

Uttarakhand: ఆ రాష్ట్ర విద్యార్థులకు గుడ్‌న్యూస్.. టాబ్లెట్‌ కొనుగోలుకు ఆర్థిక సాయం.. నేరుగా వారి ఖాతాల్లో జమ!