Tamil Nadu: ఒకే సారి 31 మంది జంటలకు పెళ్లిళ్లు.. మంగళసూత్రాలతో పాటు అవి కూడా..

భారతీయ సమాజంలో సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో పద్ధతులు, పట్టింపులు చాలా అధికం. వధువు సరైన వరుడు గానీ, వరుడికి సరైన వధువును..

Tamil Nadu: ఒకే సారి 31 మంది జంటలకు పెళ్లిళ్లు.. మంగళసూత్రాలతో పాటు అవి కూడా..
Marriage
Follow us

|

Updated on: Dec 05, 2022 | 5:16 PM

భారతీయ సమాజంలో సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో పద్ధతులు, పట్టింపులు చాలా అధికం. వధువు సరైన వరుడు గానీ, వరుడికి సరైన వధువును గానీ జత చేయడం అంత సులభమైన పని కాదు. ఒక వేళ ఇరు కుటుంబాలు, జాతకాలు కలిసినా.. పెళ్లి చేయడం పేదలకు తీవ్ర వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి వారి ఇబ్బందులను గమనించిన తమిళనాడు ప్రభుత్వం ఒకే సారి 31 మంది జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు జరిపించారు. హిందూ దేవాదాయ శాఖ అధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం స్టాలిన్.. నవ వధూవరులకు మంగళసూత్రాలు అందించారు. మానవ సేవే మాధవ సేవ అనే తారక మంత్రానికి డీఎంకే ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. మంగళసూత్రం తో పాటు బీరువా, వంట పాత్రల సహా 30 రకాల సారె సామగ్రి అందించారు. ఆలయాలు అనేవి ప్రజలందరి కోసమేనన్న స్టాలిన్.. అవి ఏ ఒక్కరికో ఏ వర్గానికో చెందినవి కావని, రాజకీయాలు చేసేందుకు ఏ అంశమూ లేక కొందరు మతాన్ని అడ్డుగాపెట్టుకుని ఆలయాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

డీఎంకే ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా ఆలయాల జీర్ణోద్ధరణపనులు, కుంభాభిషేకాలు జరిగాయని, ఆలయాల నిర్వహణకు డీఎంకే పార్టీ వ్యతిరేకం కాదన్న ముఖ్యమంత్రి.. ఆలయాల నిర్వహణలో రాజకీయాలుండవని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఓటు వేసిన వారు, వేయని వారు అనే తేడా లేకుండా అందరికీ సమంగా పాలన అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధానమైన 47 ఆలయాల్లో తమిళంలో అర్చన చేస్తున్నారని, ఓ మహిళను అర్చకురాలిగా నియమించామని వివరించారు. పెరియార్‌ ఆశించినట్లు అన్ని కులాలవారిని అర్చకులుగా నియమించినట్లు తెలిపారు.

కాగా.. దేవాదాయ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్న ఆశాఖ మంత్రి శేఖర్‌బాబు చెప్పారు. అంతే కాకుండా రోజూ ఆలయాలను తనిఖీ చేస్తున్నారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న చర్యలను సీఎం స్టాలిన్ మెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!