Udayanidhi: ఊహాగానాలకు చెక్.. ఉదయనిధికి మంత్రి పదవి ఖాయం.. రేపే ప్రమాణ స్వీకారం..

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు, చెపాక్...

Udayanidhi: ఊహాగానాలకు చెక్.. ఉదయనిధికి మంత్రి పదవి ఖాయం.. రేపే ప్రమాణ స్వీకారం..
Udayanidhi Stalin
Follow us

|

Updated on: Dec 13, 2022 | 9:53 AM

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కు మంత్రి పదవి కేటాయిస్తూ ఆదేశిలిచ్చారు. అయితే ఏ శాఖ కేటాయించారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో రేపు (బుధవారం) ఉదయం 9.20 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2021 లో తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉదయనిధి చెన్నైలోని చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వారసత్వ రాజకీయాలు సరికావంటూ గతంలో చర్చ సాగడంతో ఆయన్ను కేబినెట్ లో తీసుకోలేదు. తాజాగా ఇప్పుడు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఆయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను కేటాయించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కొద్ది నెలలుగా మంత్రులందరూ ఉదయనిధిని మంత్రివర్గంలో తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు స్టాలిన్‌ సిద్ధమయ్యారు. దీంతో సచివాలయం పదో నెంబర్‌ ప్రవేశద్వారం సమీపంలో ఛాంబర్‌ను ఉదయనిధి కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. రెండో అంతస్థులోని ఓ విశాలమైన గదిని కూడా ఆయన కోసం రెడీ చేస్తు్న్నారు. అయితే.. మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ వీటిలో ఏదో ఒక గదిని తన అధికారిక కార్యక్రమాల కోసం ఉపయోగించుకోనున్నారు.

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఉదయనిధి తనదైన ముద్ర వేశారు. తాత క‌రుణానిధికి అస‌లైన వార‌సుడిగా నిరూపించుకున్నారు. 2019లో యువ‌జ‌న విభాగం కార్యద‌ర్శిగా నియ‌మితుల‌య్యాడు. ఉద‌య‌నిధి స్టాలిన్ రాజ‌కీయ రంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. మరోవైపు.. ఉదయనిధి స్టాలిన్ కు పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. అతనిని మంత్రి చేయాలంటూ సీఎం స్టాలిన్ కు కోరుతున్నారంటే.. ఈ యువ నాయకుడి పట్ల వారు చూపుతున్న ఆదరాభిమానాలు ఎలాంటివనేవి అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి