‘అది తాలిబన్ తరహా నేరమే !’.. కేంద్ర మంత్రి అబ్బాస్ నక్వి

దేశమంతా ఓ వైపు కరోనా భయంతో వణికిపోతుండగా.. మరోవైపు తబ్లీఘీ జమాత్ గ్రూపు.. మర్కజ్ నిజాముద్దీన్ మసీదులో పెద్ద సంఖ్యలో ప్రజలను గుమికూడజేయడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వి తీవ్రంగా ఖండించారు.

'అది తాలిబన్ తరహా నేరమే !'.. కేంద్ర మంత్రి అబ్బాస్ నక్వి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 01, 2020 | 3:18 PM

దేశమంతా ఓ వైపు కరోనా భయంతో వణికిపోతుండగా.. మరోవైపు తబ్లీఘీ జమాత్ గ్రూపు.. మర్కజ్ నిజాముద్దీన్ మసీదులో పెద్ద సంఖ్యలో ప్రజలను గుమికూడజేయడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వి తీవ్రంగా ఖండించారు. ఈ మసీదుకు 128 కరోనా కేసులు లింక్ కావడం దారుణమన్నారు. ఈ సంస్థ చేసిన పని ఏమాత్రం క్షమార్హం కాదని, దీన్ని తాలిబన్లు చేసే నేరంతో పోల్చవచ్చునని ఆయన అన్నారు.

‘ఇది నిర్లక్ష్యం కాదు.. తీవ్రమైన నేరం.. దేశమంతా ఒకవైపు కరోనా నివారణకు ఈ సమస్యపై పోరాడుతుంటే ఈ సంస్థ ఇలాంటి పాపం చేయడం క్షమార్హం కాదు’ అని నక్వి వ్యాఖ్యానించారు. కరోనా నివారణకు ప్రభుత్వం చేబట్టిన చర్యలకు సహకరించాలని, లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని పలువురు ముస్లిం మత గురువులు ప్రజలకు ఇఛ్చిన పిలుపు తాలూకు సందేశాలతో కూడిన సోషల్ మీడియా అకౌంట్లను ఆయన పోస్ట్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా సభ్యులు గల ఇస్లామిక్ మిషనరీ సంస్థ అయిన తబ్లీఘీ జమాత్.. ఛాందసవాద భావజాల సంప్రదాయాలకు ముస్లిములు  మళ్ళీ మళ్లాలని బోధిస్తోంది.  మలేసియా, పాకిస్తాన్ వంటి దేశాలకు చెందినవారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగినవారితో కూడా ఈ సంస్థ తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. జనవరి 1 నుంచి ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు, సభలకు దాదాపు 2,100 మంది విదేశీయులు హాజరయ్యారని హోం శాఖ తెలిపింది. వీరంతా మర్కజ్ నిజాముద్దీన్ మసీదులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సంస్థ పైన పోలీసు కేసు నమోదు చేయాలని , మసీదును మూసివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించిన సంగతి తెలిసిందే.