రియా చక్రవర్తి డ్రగ్స్ తెచ్చి అమ్మేదట, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదిక

సుశాంత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్స్ 'లీలలు' ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమె మత్తుమందులు తెచ్చి అమ్మేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన నివేదికలో తెలిపింది. ఆమె ఇంటిపై అధికారులు నిన్న దాడులు..

రియా చక్రవర్తి డ్రగ్స్ తెచ్చి అమ్మేదట, నార్కోటిక్స్  కంట్రోల్  బ్యూరో నివేదిక
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 05, 2020 | 3:49 PM

సుశాంత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్స్ ‘లీలలు’ ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమె మత్తుమందులు తెచ్చి అమ్మేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన నివేదికలో తెలిపింది. ఆమె ఇంటిపై అధికారులు నిన్న దాడులు జరిపిన సంగతి విదితమే. రియాకు, మరికొందరికి మధ్య వాట్సాప్ ద్వారా జరిగిన చాటింగ్ ని బట్టి చూస్తే.. డ్రగ్స్ ని తేవడం, వినియోగించడం, అమ్మడం, రవాణా చేయడం వంటివన్నీ జరిగినట్టు తెలుస్తోందని ఈ రిపోర్టు పేర్కొంది.  దీనికి సంబంధించి ఆమె నుంచి మరిన్ని వివరాలు, సమాచారాన్ని రాబట్టేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిబ్బంది ఆమెను ఆదివారం విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు ఆమెకు అప్పుడే సమన్లు పంపినట్టు తెలుస్తోంది. ఇంటరాగేషన్ అనంతరం ఆమెను అరెస్టు చేయవచ్చునని కూడా అంటున్నారు.

ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి నుంచి పలు వివరాలను అధికారులు రాబట్టారు. ఇతడు కూడా కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు మత్తుమందులు సరఫరా చేసేవాడని తెలిసింది.