Maharashtra: పుట్టిన రోజు కదా అని చాక్లెట్లు పంచితే.. ఊహించని ట్విస్ట్ కు మైండ్ బ్లాంక్ అయ్యింది..

పుట్టినరోజుకు చాక్లెట్లు, స్వీట్లు పంచడం కామన్. స్కూళ్లల్లో అయితే ఇది మరీ అధికం. ఏ స్టూడెంట్స్ బర్త్ డే అయినా వీటని పంచాల్సిందే. చిన్నారుల సంగతి సరే.. కానీ పెద్దవాళ్లు తమ పుట్టిన రోజు సందర్భంగా...

Maharashtra: పుట్టిన రోజు కదా అని చాక్లెట్లు పంచితే.. ఊహించని ట్విస్ట్ కు మైండ్ బ్లాంక్ అయ్యింది..
Birthday Chocolates
Follow us

|

Updated on: Dec 04, 2022 | 9:52 AM

పుట్టినరోజుకు చాక్లెట్లు, స్వీట్లు పంచడం కామన్. స్కూళ్లల్లో అయితే ఇది మరీ అధికం. ఏ స్టూడెంట్స్ బర్త్ డే అయినా వీటని పంచాల్సిందే. చిన్నారుల సంగతి సరే.. కానీ పెద్దవాళ్లు తమ పుట్టిన రోజు సందర్భంగా చాక్లెట్లు పంచితే.. ఏముంది.. బాగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు బెడిసికొడతాయని నిరూపించే ఇన్సిడెంట్ ఇది. తన పుట్టిన రోజు అని.. ఓ వ్యక్తి స్కూల్ బయట ఆడుకుంటున్న చిన్నారులకు చాక్లెట్లు పంచాడు. ఆ తర్వాతే ఊహించని ఘటన జరిగింది. సంతోషంగా వాటిని తీసుకుని తిన్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఏకంగా ఆస్పత్రి పాలయ్యారు. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాక్లెట్లు పంచిన వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు అన్వేషిస్తున్నారు. మహారాష్ట్ర నాగపూర్ నార్త్ అంబజారి రోడ్డులోని మదన్ గోపాల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పాఠశాల ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కారులో వచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న చిన్నారులకు తన పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్లు పంచాడు.

అయితే చాక్లెట్​లు తిన్న కొద్ది సమయంలోనే వారికి ఆరోగ్యం క్షీణించింది. కేవలం గంటలోనే అందరికీ ఛాతీ నొప్పి, వాంతులు అధికమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స కోసం సమీపంలోని లతా మంగేష్కర్ ఆస్పత్రికి తరలించారు. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తినడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చిన్నారులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అతడు నల్లటి కారులో ముసుగు ధరించి వచ్చినట్లు విద్యార్థులు.. పోలీసులకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?