Strain Virus: హడలెత్తిస్తున్న కొత్తరకం వైరస్ స్ట్రెయిన్‌.. కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు..

కరోనా నుంచి కోలుకుంటున్నామని ఊపిరి పీలుస్తుండగానే.. ఆ మహమ్మారి రూపాంతరం చెంది మరింత బలంగా తయారవుతూ జనాలను హడలెత్తిస్తోంది.

Strain Virus: హడలెత్తిస్తున్న కొత్తరకం వైరస్ స్ట్రెయిన్‌.. కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు..
Follow us

|

Updated on: Dec 22, 2020 | 5:38 AM

Strain Virus: కరోనా నుంచి కోలుకుంటున్నామని ఊపిరి పీలుస్తుండగానే.. ఆ మహమ్మారి రూపాంతరం చెంది మరింత బలంగా తయారవుతూ జనాలను హడలెత్తిస్తోంది. తాజాగా స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. మునిసిపాలిటీ ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే యూరప్ నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.

మరోవైపు తమిళనాడు సర్కార్‌ కూడా అప్రమత్తమైంది. స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెరీనా బీచ్ సహా పలు ప్రధాన కూడళ్లలో వేడకలకు అనుమతిని నిరాకరించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు బీచ్‌లు, పార్క్‌ల్లో వేడుకలను నిషేధించింది. జనం గుమిగూడే అన్ని ప్రాంతాల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించోద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు అలర్ట్ అయ్యారు. విదేశాల నుండి చెన్నై ఎయిర్‌పోర్టు చేరుకుంటున్న ప్రయాణికులకు వైద్య పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేలా ఏర్పాటు చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Also read:

యూకేలో స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి​తో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ..విదేశాల నుంచి వచ్చేవారిపై స్పెషల్ ఫోకస్

‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత జాబితా సిద్ధం.. జనవరి 9న లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ..