శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం

ఆగస్టు 5వ తేదీన బుధవారం అయోధ్యలో జరగబోయే శ్రీ రామ మందిర నిర్మాణం భూమిపూజ కార్యక్రమానికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్ ఫౌండేషన్ చీఫ్ శ్రీ శ్రీ రవి శంకర్‌కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలను సంస్థ..

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం

ఆగస్టు 5వ తేదీన బుధవారం అయోధ్యలో జరగబోయే శ్రీ రామ మందిర నిర్మాణం భూమిపూజ కార్యక్రమానికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్ ఫౌండేషన్ చీఫ్ శ్రీ శ్రీ రవి శంకర్‌కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలను సంస్థ కొట్టిపారేసింది. భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు పలు మీడియా సంస్థలకు చెందిన వాటిలో శ్రీ శ్రీ రవిశంకర్‌ కూడా అయోధ్యలో జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి వెళ్లబోతున్నట్లు వార్తలను ప్రసారం చేశాయి. ఈ క్రమంలోనే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ స్పందించింది. రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు నుంచి రవి శంకర్‌కు ఆహ్వానం లేదని తెలిపింది.

ఇదిలావుంటే.. ఇప్పటికే ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ అయోధ్యకు చేరుకున్నారు. ఇక అయోధ్య పరిసర ప్రాంతాలన్ని విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. నగరం మొత్తం లేజర్‌ లైట్లతో అలంకరించారు. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ.. అన్ని చోట్ల కాషాయ జెండాలను ఎగరవేస్తున్నారు.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

Click on your DTH Provider to Add TV9 Telugu