ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన, ఎన్‌ఎస్‌జీ టీమ్ దర్యాప్తు ప్రారంభం, ఆర్‌డీ‌ఎక్స్ వాడి ఉంటే ..

ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద నిన్న జరిగిన పేలుడుపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్ జీ ) కి చెందిన బాంబ్ డేటా సెంటర్ దర్యాప్తు ప్రారంభించింది.

  • Umakanth Rao
  • Publish Date - 7:03 pm, Sat, 30 January 21
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన, ఎన్‌ఎస్‌జీ టీమ్ దర్యాప్తు ప్రారంభం, ఆర్‌డీ‌ఎక్స్ వాడి ఉంటే ..

ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద నిన్న జరిగిన పేలుడుపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్ జీ ) కి చెందిన బాంబ్ డేటా సెంటర్ దర్యాప్తు ప్రారంభించింది. ఇండియాలోనూ, విదేశాల్లోనూ జరిగిన, జరుగుతున్న ఈ విధమైన సందర్భాల్లో.. పేలుడులో అవాంఛనీయ శక్తులు ఉపయోగించిన పదార్థాలను ఈ టీమ్ విశ్లేషిస్తుంటుంది.  ఢిల్లీ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు పేలుడుకు  అమోనియం  నైట్రేట్ ను వినియోగించారని తేలింది. అంటే  దీనికన్నా పవర్ ఫుల్ అయిన ఆర్దీఎక్స్ ను వినియోగించి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని భావిస్తున్నారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ కు గట్టి  మెసేజ్ ను పంపేందుకు జరిగిన కుట్రలో ఇది భాగమని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థలంలో పోలీసులకు ఓ లేఖతో బాటు సగం కాలిన పింక్ స్కార్ఫ్ కూడా లభించింది. ఈ లేఖలో ఇది ట్రైలర్ మాత్రమే అని రాసి ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ బాంబును పేల్చిన అనుమానితులకోసం పోలీసులు నగరం నలుమూలలా గాలిస్తున్నారు. మిగిలిన చోట్ల ఎక్కడైనా  ఇలా బ్యాటరీలతో  కూర్చిన ఇంప్రొవైజ్డ్ పేలుడు వస్తువులను ఉంచారా అని అణువణువూ సెర్చ్ చేస్తున్నారు.  ఇది స్వల్ప ఘటనే అయినా దీన్ని ప్రభుత్వం, పోలీసులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఇలా ఉండగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా గల తమ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని ఆదేశించింది. 2012 లో కూడా ఢిల్లీ నగరంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద దాదాపు ఇదే విధమైన ఘటన జరిగింది. నాటి ప్రధాని నివాసానికి కేవలం 300 మీటర్ల దూరంలో నాడు ఆ సంఘటన జరిగింది.

Read More:గాంధీలో సాధారణ సేవలు పునఃప్రారంభంపై ఉత్తర్వులు… ఈనెల 21 నుంచి అందుబాటులోకి అన్ని రకాల సేవలు..