సోనియా గాంధీకి మరో ఛాన్స్ !

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మరోదఫా అవకాశం దక్కబోతోంది. పార్టీ అధినేత్రిగా గత 23 ఏళ్లుగా కొనసాగుతున్న సోనియాగాంధీ మధ్యలో కొంతకాలం రాహుల్ గాంధీని ప్రమోట్ చేసే సమయంలో తప్ప పార్టీ సారథిగా కొనసాగుతూ వస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకోగా పార్టీ సీనియర్ నేతల అభ్యర్థన మేరకు...

సోనియా గాంధీకి మరో ఛాన్స్ !
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 09, 2020 | 9:01 AM

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మరోదఫా అవకాశం దక్కబోతోంది. పార్టీ అధినేత్రిగా గత 23 ఏళ్లుగా కొనసాగుతున్న సోనియాగాంధీ మధ్యలో కొంతకాలం రాహుల్ గాంధీని ప్రమోట్ చేసే సమయంలో తప్ప పార్టీ సారథిగా కొనసాగుతూ వస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకోగా పార్టీ సీనియర్ నేతల అభ్యర్థన మేరకు ఆమె తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలిగా ఆమె పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరో దఫా ఆమెనే సీడబ్ల్యూసీ అధ్యక్షురాలిగా కొనసాగాలని పార్టీ సీనియర్ నేతలు కోరుతున్నారు. ఆగస్టు 10 తేదీతో సోనియాగాంధీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరి కొంతకాలం ఆమెనే అధ్యక్షురాలిగా కొనసాగాలని ఇతర సిడబ్ల్యుసి సభ్యులు కోరుకుంటున్నారు.

వాస్తవానికి గత ఏప్రిల్ నెలలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశమై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండింది. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. అదే సమయంలో సీడబ్ల్యూసీ అధ్యక్షురాలిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశమై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిపై నిర్ణయం తీసుకోవడంతో పాటు పలు విధాన నిర్ణయాలపై సమాలోచనలు జరపాలని భావించింది. కానీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రం కావడం, ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తదనంతర పరిణామాల నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ నిరవధికంగా వాయిదా పడింది.

తాజాగా ఆగస్టు 10వ తేదీతో సోనియాగాంధీ సీడబ్ల్యూసీ అధ్యక్షురాలిగా ఏడాది పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయి అధ్యక్షుని విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కలిగింది. అయితే దేశంలో ఇప్పుడు కూడా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో సీడబ్ల్యూసీ కీలక నేతలు వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు అయిన అశోక్ గెహ్లాట్… రాహుల్ గాంధీని పూర్తిస్థ%B

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..