Sanjay Raut: ఆ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి తమ పార్టీని బెదిరించకూడదన్న ఆయన.. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలు కటకటాలపాలవుతారన్నారు.

Sanjay Raut: ఆ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్
Sanjay Raut
Follow us

|

Updated on: Feb 15, 2022 | 7:59 AM

Sanjay Raut Sensational Comments: శివసేన(Shiva Sena) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారతీయ జనతా పార్టీ(BJP) ముఖ్యనేతలు జైలుకు వెళ్లక తప్పదని సంజయ్ రౌత్ హెచ్చరించారు. ఇప్పటికే చాలా భరించాం. అందుకే త్వరలోనే గట్టి నిర్ణయం తీసుకోబోతున్నామని ఆయన తెలిపారు. వారి పేర్లను మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడిస్తామన్నారు. ఇదిలావుంటే, బీజేపీకి చెందిన ఆ నేతలు ఎవరు? అన్నది నేటి మీడియా సమావేశంలో తేలనుంది. మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వంలోని కొంతమంది నేతలపై ప్రతిపక్ష బీజేపీ అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం మీడియా సమాశంలో మాట్లాడారు. కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి తమ పార్టీని బెదిరించకూడదన్న ఆయన.. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలు కటకటాలపాలవుతారన్నారు.

ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో బీజేపీ నేతల పేర్లను వెల్లడిస్తానని, ఇక్కడ పార్టీ కీలక నేతలు పాల్గొంటారని రౌత్ విలేకరులతో అన్నారు. గత ఏడాది నవంబర్‌లో మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన రాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ త్వరలో జైలు నుంచి బయటకు వస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కూడిన ప్రభుత్వ నాయకులపై బీజేపీ గతంలో అవినీతి ఆరోపణలు చేసింది.శివసేన పార్టీతో పాటు థాకరే కుటుంబంపై చేసిన తప్పుడు ఆరోపణలకు కేంద్ర సంస్థల బెదిరింపులు అన్నింటికి త్వరలో సమాధానాలు దొరుకుతాయని రౌత్ చెప్పారు.

చాలా భరించాం, పాడైపోయాం, అయినా చేస్తాం. తలపై నీళ్లు ఎక్కువగా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, అలాంటి మాటల్లోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీని హెచ్చరించారు. బీజేపీకి చెందిన నేతలు కూడా అనిల్ దేశ్‌ముఖ్ ఉన్న సెల్‌లో ఉంటారని సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. వారికి నిద్ర పట్టదు. మీకు ఏది కావాలంటే అది చేయండి, ఇప్పుడు నేను భయపడను, రౌత్ చెప్పారు.

ఇదిలా ఉంటే సంజయ్ రౌత్ వార్నింగ్ తర్వాత రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రౌత్ పేర్కొన్న బీజేపీ వ్యక్తులు ఎవరు? ఈ ప్రశ్న ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకే, ఈరోజు మధ్యాహ్నం సేన భవన్‌లో జరిగే విలేకరుల సమావేశంపైనే అందరి దృష్టి నెలకొంది. సరిగ్గా ఈరోజు శివసేన ఏ బాంబు పేల్చనుంది? మరి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందా? చూడాల్సి ఉంది. రేపు శివసేన భవన్‌లో మీడియా సమావేశం. ఈ సమావేశానికి శివసేన నేతలు, ఎంపీలు అందరూ హాజరుకానున్నారు. ప్రజల ముందు, ప్రభుత్వం ముందు వాస్తవాలను ప్రదర్శించేందుకే ఇది మీడియా సమావేశం అని శివసేన నేత అనిల్ దేశాయ్ అన్నారు.

Read Also….. Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్‏గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..