గంటల తరబడి రెమ్ డెసివిర్ మందు కోసం పడిగాపులు, చెన్నైలో భౌతిక దూరం పాటించని యువకులు, ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ

కోవిద్ చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ మెడిసిన్ కోసం కొన్ని వందలమంది ఓ స్టేడియం వద్ద బారులు తీరారు. ఈ మందు ఇక్కడ అమ్ముతామని బోర్డు పెట్టడంతో కొద్దిసేపట్లోనే పెద్ద సంఖ్యలో జనాలు క్యూలు కట్టారు. ఒకరికొకరు దాదాపుతోసుకుంటూ....

  • Publish Date - 1:39 pm, Sun, 16 May 21 Edited By: Anil kumar poka
గంటల తరబడి రెమ్ డెసివిర్ మందు కోసం పడిగాపులు, చెన్నైలో భౌతిక దూరం పాటించని యువకులు,  ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
Social Distance Tossed Away As Hundreds Throng To Take Remdesivir Medicine

కోవిద్ చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ మెడిసిన్ కోసం కొన్ని వందలమంది ఓ స్టేడియం వద్ద బారులు తీరారు. ఈ మందు ఇక్కడ అమ్ముతామని బోర్డు పెట్టడంతో కొద్దిసేపట్లోనే పెద్ద సంఖ్యలో జనాలు క్యూలు కట్టారు. ఒకరికొకరు దాదాపుతోసుకుంటూ భౌతిక దూరమన్నది పాటించకుండా గంటల తరబడి నిరీక్షించారు. తన తలిదండ్రులకు కోవిద్ పాజిటివ్ సోకిందని, 10 రోజులుగా వారికి ఈ మందు ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పడంతో 10 రోజులుగా ఈ మెడిసిన్ కోసం ప్రయత్నిస్తున్నానని సందీప్ రాజ్ అనే యువకుడు తెలిపాడు. అయితే ఇది లభించకపోవడంతో తన తండ్రి మరణించాడని, కనీసం తన తల్లినైనా బతికించుకుందామని ఇక్కడికి వచ్చానని అతడు తెలిపాడు. తనకు టోకెన్ ఇఛ్చారని. కానీ తనకన్నా ముందే లైన్లో చాలామంది ఉన్నారని, కనీసం ఈ రోజైనా తనకు ఈ మెడిసిన్ లభిస్తుందో లేదోతెలియదని అన్నాడు. ఇంకా ఇక్కడ చేరినవారిలో చాలామంది ఇలాగే తమ దీనగాథలు వినిపించారు. అసలు ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా ఇలా ఒకరికొకరు తోసుకుంటూ నిలబడితే ఇక కోవిడ్ ఇంకా వ్యాపిస్తుందని మరో వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు.తాను ఈ తెల్లవారుజామున ఒంటిగంట నుంచే ఇక్కడ నిరీక్షిస్తున్నానని ఆయన చెప్పాడు.

కాగా ఈ మందును సీరియస్ గా ఉన్న కోవిద్ రోగులకు మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నా చాలామంది డాక్టర్లు దీన్ని సిఫారసు చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. బ్లాకులో అనేకమంది దీన్ని విక్రయిస్తున్నారు. పోలీసులు పట్టుకుంటున్నా ఫలితం లేకపోతోంది.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : 5 tigers and 1 monkey viral video :ఒకేసారి ఐదు పులుల్ని ముప్పతిప్పలు పెట్టిన వానరం..కోతి చేష్టలుకు అల్లాడిపోయిన పులులు.

స్నేహమంటే ఇదేరా ? జాతివైరం లేని మూగ మిత్రులు..ట్రెండ్ అవుతున్న గొరిల్లా మరియు తాబేలు వైరల్ వీడియో ..: Gorilla and Tortoise ViralVideo

సాయం పొందిన రియల్ హీరో..! ఆ అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు – సోను సూద్ :Sonu Sood video.