Snakebite: పాముకాటుకు అన్న బలి.. అంత్యక్రియులకు వచ్చిన తమ్ముడు కూడా పాముకాటుతోనే

ఆ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి. యాధృచ్చికంగా ఇద్దరు సోదరులు పాముకాటుతో రోజుల వ్యవధిలో మృత్యువాతపడ్డారు. దీంతో కన్నవారి రోదనలు మిన్నంటాయి.

Snakebite: పాముకాటుకు అన్న బలి.. అంత్యక్రియులకు వచ్చిన తమ్ముడు కూడా పాముకాటుతోనే
representative image
Follow us

|

Updated on: Aug 05, 2022 | 8:30 AM

Tragedy: ఇంతకంటే ట్రాజెడీ ఉంటుందా. ఓ వ్యక్తి పాము కాటు వేయడంతో మరణించాడు. అతడి అంతిమ సంస్కారాలకు వచ్చిన వ్యక్తి సైతం నిద్రిస్తుండగా మరో సర్పం కాటు వేయడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ ఫ్యామిలీపై పాములు పగబట్టాయని స్థానికులు అంటున్నారు. ఈ విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవానీపుర్‌లో నివాసం ఉండే 38 ఏళ్ల  అర్వింద్‌ అనే వ్యక్తి ఆగస్టు 2వ తేదీ రాత్రి పాము కాటుకు గురయ్యాడు. కానీ కుటుంబ సభ్యులు అతడిని కాపాడుకోలేకపోయారు. దీంతో ఆగస్టు 3న అతడిని స్మశానానికి తీసుకెళ్లి దహనం చేశారు. అంత్యక్రియలకు మృతుడి సోదరుడైన 22 ఏళ్ల గోవింద్‌ మిశ్రా పాల్గొన్నాడు. అనంతరం ఇంటికి వెళ్లి రాత్రి నిద్రిస్తుండగా.. అతడి మరో సర్పం కాటేసింది. అక్కడే నిద్రిస్తున్న వారి బంధవు చంద్రశేఖర్‌ పాండేను కూడా ఆ పాము కాటు వేసింది. ఈ ఘటనలో గోవింద్‌ చనిపోగా.. పాండేను హాస్సిటల్‌కు తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. గోవింద్… అన్న అంత్యక్రియల కోసం లూథియానా(Ludhiana) నుంచి వచ్చి ఇలా పాముకు బలయ్యాడు. ఈ ఘటనతో గ్రామాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక శాసనసభ్యడు కైలాశ్‌ నాథ్ శుక్లా.. బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి ఓదార్చారు. అండగా ఉంటానని హామి ఇచ్చారు. గ్రామంలో పాముల సంచారానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా పాములు పగబట్టడం అంటూ ఏమీ ఉండదు. వారు నివశిస్తున్న ఇల్లు అటవీ ప్రాంతానికి దగ్గరిగా ఉండవచ్చు లేదా ఇంటికి సమీపంతో పరిశుభ్రత పాటించక చెట్లు గుబురుగా పెరిగి ఉండవచ్చు. అదే పాములగా ఆవాసంగా మారి ఉండవచ్చు. పాములు మనుషుల్ని గుర్తుపెట్టుకోలేవని.. కొన్నిసార్లు ఆహారం కోసం బయటకు వచ్చి తమ పుట్ట ఎక్కడుందో కూడా మర్చిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం