మహిళా దినోత్సవం.. మోదీ సోషల్ మీడియా ఖాతాల సైనింగ్ ఆఫ్.. ఎవరెవరికంటే ?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలను లాగౌట్ చేశారు. వీటిని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఏడుగురు మహిళలకు అప్పగించారు. తమ జీవన ప్రయాణంలోని అనుభవాలను వారు  షేర్ చేయగలరని ఆశిస్తున్నానన్నారు.

మహిళా దినోత్సవం.. మోదీ సోషల్ మీడియా ఖాతాల సైనింగ్ ఆఫ్.. ఎవరెవరికంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2020 | 11:01 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలను లాగౌట్ చేశారు. వీటిని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఏడుగురు మహిళలకు అప్పగించారు. తమ జీవన ప్రయాణంలోని అనుభవాలను వారు  షేర్ చేయగలరని ఆశిస్తున్నానన్నారు. ఉమెన్స్ డే ని పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలని, నారీ శక్తికి మేము సెల్యూట్ చేస్తున్నామని ఆయన అన్నారు. ‘కొన్ని రోజుల క్రితం నేను చెప్పినట్టు నా సోషల్ మీడియా అకౌంట్లను మీకు అప్పగిస్తున్నాను. మీ లైఫ్ జర్నీలో మీకు కలిగిన అనుభవాలను నా ఈ ఖాతాల ద్వారా షేర్ చేసుకోండి’ అని మోదీ పేర్కొన్నారు. ఇండియాలోని ఈ మహిళలంతా వివిధ రంగాల్లో విశేష కృషి చేశారని, వారి పోరాటాలు, ఆశయాలు లక్షలాదిమందిని మోటివేట్ చేస్తాయని అన్నారు. వారి నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు.

మోదీ ట్విటర్ నుంచి మొదటి ట్వీట్ ఫుడ్ బ్యాంక్ ఇండియా వ్యవస్థాపకురాలు స్నేహా మోహన్ దాస్ ని ఉద్దేశించగా.. ఆమె రీట్వీట్ చేస్తూ.. ‘మీరు ఫుడ్ ఫర్ థాట్ గురించి వినే ఉంటారని, పేదలకు ఉజ్వల భవితవ్యం కల్పించే కార్యాచరణకు సమాయత్తం కావలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తన తల్లి ఇఛ్చిన స్ఫూర్తి గురించి ప్రస్తావించిన ఆమె..తిండి, గూడు లేని నిరాశ్రయులకు గుప్పెడన్నం పెట్టడమే ధ్యేయంగా ఈ సంస్థను స్థాపించామని ఆమె అన్నారు. తనను తాను పరిచయం చేసుకుంటూ ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు. ఆకలిగొన్న వారి ఆకలి తీర్చడమే తమ లక్ష్యమన్నారు.

ఇలా ఉండగా.. మోదీకి ట్విట్టర్లో 53.3 మిలియన్ల మంది ఫాలోవర్లు, ఫేస్ బుక్ లో 44 మిలియన్ల మంది, ఇన్ స్టా గ్రామ్ లో 35.2  మిలియన్ల మంది, యూట్యూబ్ లో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!