Shraddha Murder Case: అడవిలో దొరికిన శరీర భాగాలతో శ్రద్ద తండ్రి డీఎన్‌ఏ మ్యాచ్.. బ్యాగ్‌ని మోస్తున్న అఫ్తాబ్ సీసీటీవీ ఫుటేజ్ లభ్యం..

శ్రద్ధా వాకర్ ఎముకల డీఎన్‌ఏ, ఆమె తండ్రి రక్త నమూనాతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ వర్గాలు తెలిపాయి. ఫోరెన్సిక్ విచారణలో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధలను హత్య చేసినట్లు కూడా చాలా వరకు రుజువైందని పేర్కొన్నారు.

Shraddha Murder Case: అడవిలో దొరికిన శరీర భాగాలతో శ్రద్ద తండ్రి డీఎన్‌ఏ మ్యాచ్.. బ్యాగ్‌ని మోస్తున్న అఫ్తాబ్ సీసీటీవీ ఫుటేజ్ లభ్యం..
Shraddha Murder Case
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 26, 2022 | 2:12 PM

ఢిల్లీలోని శ్రద్ధా హత్య కేసులో ఫోరెన్సిక్ వర్గాలు తమ నివేదికను ఇచ్చినట్లు సమాచారం. మెహ్రౌలీ అడవిలో లభించిన ఎముకల డీఎన్‌ఏ, శ్రద్ధా తండ్రి డీఎన్‌ఏతో సరిపోలినట్లు సమాచారం. దీంతో శ్రద్ధ హత్యకు గురైందని.. అడవిలో దొరికిన కుళ్లిన ఎముకలు శ్రద్ధవే అని స్పష్టం చేశారు.  శ్రద్దా హత్య దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు అడవిలో వెతకగా కొన్ని ఎముకలు లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధా వాకర్ ఎముకల డీఎన్‌ఏ, ఆమె తండ్రి రక్త నమూనాతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ వర్గాలు తెలిపాయి. ఫోరెన్సిక్ విచారణలో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధలను హత్య చేసినట్లు కూడా చాలా వరకు రుజువైందని పేర్కొన్నారు. అడవి నుండి వెలికితీసిన కొన్ని ఎముకలను మాత్రమే కాదు.. ఫ్లాట్ టైల్స్ మధ్య దొరికిన రక్తం ద్వారా ఇది నిర్ధారించబడింది.

ఫోరెన్సిక్ ల్యాబ్ వర్గాల నివేదిక తర్వాత.. కేసుని దర్యాప్తు చేస్తోన్న పోలీసు బృందానికి చాలా ఉపశమనం లభించినట్లు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పుడు కోర్టులో వాదనల సందర్భంగా చార్జిషీట్‌ను సిద్ధం చేయడం, నేరం రుజువు చేయడంలో పెద్ద ఇబ్బంది తలెత్తదని తెలుస్తోంది. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందం ఢిల్లీ పోలీసులకు మౌఖిక సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. అఫీషియల్ రిపోర్ట్ రావడానికి రెండు నుంచి  నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఫోరెన్సిక్ విచారణలో మృతదేహాన్ని రంపంతో కోసినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

సీసీటీవీలో కనిపించిన అఫ్తాబ్: ఢిల్లీలో శ్రద్ధా హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు సీసీటీవీ ఫుటేజీ లభించింది. ఈ ఫుటేజీలో హంతకుడు, శ్రద్దా లివ్ ఇన్ భాగస్వామి అఫ్తాబ్ రాత్రి చీకటిలో ఒక బ్యాగ్‌ని మోస్తూ కనిపించాడు. ఛతర్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంట్లో అమర్చిన సీసీటీవీ ద్వారా ఈ ఫుటేజీ పోలీసులకు లభించింది. ఈ ఫుటేజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్తాబ్‌ తీసుకుని వెళ్తున్న బ్యాగ్ చాలా ఉబ్బిపోయి ఉంది. అందులో ఏదో బరువైన వస్తువు నింపినట్లు బరువుగా బ్యాగ్ ని అఫ్తాబ్ మోస్తున్నట్లు వీడియో ద్వారా పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

జీపీఎస్ ఆఫ్ చేసి అడవిలోకి వెళ్లిన అఫ్తాబ్ అఫ్తాబ్ శ్రద్ధ ఎముకలను పారవేసేందుకు ఇంటి నుండి బయలుదేరే సమయంలో తన మొబైల్ ఫోన్  GPS స్విచ్ ఆఫ్ చేసేవాడు. తన ఫోన్‌ను ఫ్లాట్‌లోనే ఉంచేవాడినని లేదా దాని GPS ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే శరీర భాగాలను అడవిలో విసిరి వేయడానికి వెళ్లే వాడినని  ఉంచడానికి వెళ్లేవాడని అఫ్తాబ్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనానంతరం ముంబై వెళ్లినప్పుడు శ్రద్ధా మొబైల్ సిమ్ కార్డు సముద్రంలో పడేసినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. ముంబై నుంచి తిరిగి వస్తుండగా మొబైల్‌ను నదిలో విసిరేశాడు.

ఇతర మృతదేహాలకు కూడా \ డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్న పోలీసులు శ్రద్ధా శరీర భాగాల కోసం వెదుకుతున్న పోలీసులకు మరికొన్ని మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఇందులో రెండు మృతదేహాలు మహిళలవి. ఈ మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్ష కూడా నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..