సేన నేత సంజయ్ రౌత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హఠాత్తుగా అస్వస్థులయ్యారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను సోమవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల క్రితం కూడా ఆయన రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని డాక్టర్లు తెలిపారు. కాగా.. ఈసీజీ రిపోర్టు పరీక్షించి తదుపరి టెస్టులకోసం ఇవాళ రావలసిందిగా తాము కోరామన్నారు. అయితే తమ సోదరుడు రేపు డిశ్చార్జ్ కావచ్ఛునని సంజయ్ బ్రదర్ సేన ఎమ్మెల్యే సునీల్ రౌత్ తెలిపారు. అసలే మహారాష్ట్రలో […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:12 pm, Mon, 11 November 19
సేన నేత సంజయ్ రౌత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హఠాత్తుగా అస్వస్థులయ్యారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను సోమవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల క్రితం కూడా ఆయన రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని డాక్టర్లు తెలిపారు. కాగా.. ఈసీజీ రిపోర్టు పరీక్షించి తదుపరి టెస్టులకోసం ఇవాళ రావలసిందిగా తాము కోరామన్నారు. అయితే తమ సోదరుడు రేపు డిశ్చార్జ్ కావచ్ఛునని సంజయ్ బ్రదర్ సేన ఎమ్మెల్యే సునీల్ రౌత్ తెలిపారు. అసలే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చల మీద చర్చలు జరుగుతున్న తరుణంలో సంజయ్ రౌత్ ఆస్పత్రి పాలవడం గమనార్హం.