Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అరెస్ట్.. ఇవాళ కోర్టులో హాజరు పర్చనున్న ఈడీ..

ED అధికారుల ముందు రౌత్‌ గతంలో ఒకసారి హాజరయ్యారు. కానీ ఇటీవల జారీ చేసిన సమన్లను ఆయన పట్టించుకోలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి విచారణకు హాజరు కాలేదు.

Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అరెస్ట్.. ఇవాళ కోర్టులో హాజరు పర్చనున్న ఈడీ..
Sanjay Raut Ed Raid
Follow us

|

Updated on: Aug 01, 2022 | 5:40 AM

Sanjay Raut Detained: పత్రాచల్‌ ల్యాండ్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. ఆదివారం శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ను అరెస్ట్ చేసింది. సోదాల అనంతరం సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తసుకున్నారు. ఇంటినుంచి ముంబైలోని ఈడీ ఆఫీస్‌కు తీసుకెళ్లిన అధికారులు.. ప్రశ్నల వర్షం కురిపించారు. సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసినట్లు ఆదివారం అర్థరాత్రి అతని సోదరుడు సునీల్ రౌత్ తెలిపారు. రౌత్‌ను సోమవారం కోర్టు ముందు హాజరుపరుస్తామని అధికారులు చెప్పినట్లు సునీల్ తెలిపారు. ఈరోజు 11.30 గంటలకు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. కాగా.. 1,034 కోట్ల రూపాయల పత్రాచాల్‌ భూ కుంభకోణంలో ఇప్పటికే ED అనేక సార్లు సంజయ్‌ రౌత్‌కు సమన్లు పంపించింది. రూ.1,034 కోట్ల పత్రాచల్‌ ల్యాండ్‌ స్కాం, మనీలాండరింగ్‌ కేసులో జూన్‌ 28న రౌత్‌కు మొదటిసారి సమన్లు జారీ చేశారు. ED అధికారుల ముందు రౌత్‌ గతంలో ఒకసారి హాజరయ్యారు. కానీ ఇటీవల జారీ చేసిన సమన్లను ఆయన పట్టించుకోలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముంబై శివారులోని భాండూప్‌లోని ఉన్న సంజయ్ రౌత్‌ నివాసానికి ఆదివారం ఉదయం వెళ్లిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం సంజయ్ రౌత్‌ నివాసం నుంచి 11.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

అయితే, తనపై తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు స్టేట్‌మెంట్లతో విచారణ జరుగుతోందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఈ కేసులకు భయపడబోనని, శివసేనను వీడేది లేదన్నారు సంజయ్‌ రౌత్‌ స్పష్టంచేశారు. మాట్లాడే వ్యక్తులపై తప్పుడు కేసులు, పత్రాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. శివసేన, మహారాష్ట్రలను బలహీనపరిచేందుకే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు సంజయ్ రౌత్ మెడలో వేసుకున్న కాషాయ కండువాను ఊపుతూ కార్యకర్తలకు అభివాదం చేశారు. తామే అసలైన హిందుత్వకు ప్రతినిధులమన్నారు. గట్టి భద్రత మధ్య రౌత్‌ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పత్రాచాల్‌ స్కాంకు సంబంధించి ఈడీ ఆఫీస్‌లో రౌత్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??