గ్రామస్థుల దాడిలో మృతి చెందిన చిరుత

ఒడిషాలో ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుతపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ చిరుత తీవ్ర గాయాలపాలై చనిపోయింది. ఈ సంఘటన రాష్ట్రంలోని సుందర్‌గర్‌ జిల్లాలో..

గ్రామస్థుల దాడిలో మృతి చెందిన చిరుత

ఒడిషాలో ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుతపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ చిరుత తీవ్ర గాయాలపాలై చనిపోయింది. ఈ సంఘటన రాష్ట్రంలోని సుందర్‌గర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంత సమీపంలో ఉండే బాద్ రాంపియా గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన గ్రామస్థులు.. చిరుతపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో గ్రామస్థులపై చిరుత దాడికి పాల్పడింది. చిరుత దాడిలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే భయంతో వణికిపోయిన జనం.. చిరుతపై మూక దాడికి పాల్పడ్డారు. దీంతో అది తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. సమీపంలోని ఓ రైల్వే ట్రాక్‌ వద్ద చిరుత మృతదేహం పడి ఉంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Click on your DTH Provider to Add TV9 Telugu