17రోజుల క్రితం పుట్టిన పాపను చూడకుండానే.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ‘అమర జవాన్’ కథ

భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అందులో ఝార్ఖండ్‌కి చెందిన సెపోయ్ కెకె ఓజా(26) ఒకరు.

  • Tv9 Telugu
  • Publish Date - 6:57 pm, Thu, 18 June 20
17రోజుల క్రితం పుట్టిన పాపను చూడకుండానే.. కన్నీళ్లు పెట్టిస్తోన్న 'అమర జవాన్' కథ

భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అందులో ఝార్ఖండ్‌కి చెందిన సెపోయ్ కెకె ఓజా(26) ఒకరు. కాగా ఓజా భార్య నేహా దేవి 17 రోజుల క్రితమే పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఆ బిడ్డను కనీసం తొలి చూపు కూడా చూడకుండానే ఆయన మరణించారు. దీంతో ఓజా కుటుంబ సభ్యుల బాధ రెట్టింపైంది.

ఝార్ఖండ్‌లోని దిహారీ గ్రామానికి చెందిన ఓజా 2011లో బీహార్ రెజిమెంట్ నుంచి భారత ఆర్మీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించిన ఓజా.. భారత్-చైనా సరిహద్దులో జవాన్‌గా సేవలందిస్తూ వీర మరణం పొందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఐదు నెలల క్రితం ఓజా సెలవలపై ఇంటికి వచ్చారు. 15 రోజుల క్రితం చివరిసారిగా ఓజాతో మాట్లాడాం అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదిలా ఉంటే భారత్-చైనా సరిహద్దులో వీరమరణం పొందిన జవాన్లలో తెలంగాణకు చెందిన సంతోష్‌ బాబు కూడా ఉన్నారు. అధికార లాంఛనాల మధ్య ఆయన అంత్యక్రియలు ఇవాళ జరిగాయి.

Read This Story Also: శ్రీశాంత్ నిరీక్షణకు ఫలితం.. త్వరలోనే ఎంట్రీ