‘ఆధ్యాత్మిక గురువు’గా చెప్పుకున్న శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదు

తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకున్న శివశంకర్ బాబాపై చెన్నై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. చెన్నై సమీపంలోని కీలంబాక్కంలో తన స్కూలుకు చెందిన పలువురు విద్యార్థినులను ఈ బాబా లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి.

  • Publish Date - 5:16 pm, Sun, 13 June 21 Edited By: Phani CH
'ఆధ్యాత్మిక గురువు'గా చెప్పుకున్న శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదు
Shiv Shankar Baba Has Been Booked After Sexual Abuse Complaints

తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకున్న శివశంకర్ బాబాపై చెన్నై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. చెన్నై సమీపంలోని కీలంబాక్కంలో తన స్కూలుకు చెందిన పలువురు విద్యార్థినులను ఈ బాబా లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే విద్యా సంస్థను ఇతగాడు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ చదివిన విద్యార్థినులు …ఇతడు తమపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరికొంతమంది కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా తమ ఆవేదనను వీరు వ్యక్తం చేశారు. పోలీసులతో బాటు చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ కూడా స్పందించి శివశంకర్ బాబాకు సమన్లు జారీ చేసింది.

కానీ అతగాడు ఈ కమిటీ ముందు హాజరు కాలేదు. పైగా ఛాతీ నొప్పితో తమ గురువు డెహ్రాడున్ లోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని అతని శిష్యులు ఈ కమిటీకి తెలిపారు. ముఖ్యంగా ముగ్గురు స్టూడెంట్స్ చేసిన ఫిర్యాదుతో కీలంబాక్కం మహిళా పోలీసులు శివశంకర్ బాబాపై పోక్సో లోని వివిధ సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారు. ఈ కేసు తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం దీన్ని సీబీసీఐడీకి ట్రాన్స్ ఫర్ చేసింది. ఇద్దరు మైనర్లతో బాటు మొత్తం 13 మంది బాధితులను అధికారులు కలిసి వివరాలు సేకరించనున్నారు.

ఇటీవల చెన్నైలోని 5 ప్రముఖ స్కూళ్లకు చెందిన టీచర్లు కూడా కొందరు మాజీ విద్యార్థినులను, ప్రస్తుతం చదువుతున్నవారిని కూడా లైంగికంగా వేధించినట్టు వార్తలు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వల్ల బ్లడ్ క్లాటింగ్……ఆ వయస్సువారికి నిలిపివేయాలన్న యూరోపియన్ యూనియన్ మెడికల్ ఏజెన్సీ

Dragan Warning: జీ7 దేశాలను డ్రాగన్ వార్నింగ్.. చిన్న కూటములతో ప్రపంచాన్ని నిర్దేశించలేరన్న చైనా