Buddha Idol: 2 వేల ఏళ్ల నాటి బుద్ధుడి అరుదైన విగ్రహం స్వాధీనం.. గాంధార శిల్పకళకు చెందినదిగా గుర్తింపు..

బుద్ధుడి అరుదైన విగ్రహాన్ని అమృత్‌సర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది క్రీస్తుశకం రెండు లేదా 3వ శతాబ్దానికి చెందిన అతి పురాతన రాతి విగ్రహమని పంజాబ్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Buddha Idol: 2 వేల ఏళ్ల నాటి బుద్ధుడి అరుదైన విగ్రహం స్వాధీనం.. గాంధార శిల్పకళకు చెందినదిగా గుర్తింపు..
Buddha Idol
Follow us

|

Updated on: Nov 12, 2022 | 6:20 AM

బుద్ధుడి అరుదైన విగ్రహాన్ని అమృత్‌సర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది క్రీస్తుశకం రెండు లేదా 3వ శతాబ్దానికి చెందిన అతి పురాతన రాతి విగ్రహమని పంజాబ్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ విగ్రహాన్ని పాక్ నుంచి భారత్‌కు వచ్చిన విదేశీయుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం తెలిపారు. భారత్ – పాకిస్థాన్‌ సరిహద్దులోని అట్టారీ-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు ద్వారా భారత్‌కు వచ్చిన విదేశీయుడిని.. ఆపి అతని లగేజీని తనిఖీ చేశారు. ఈ క్రమంలో లగేజీలో పురాతన బుద్ధుని విగ్రహం బయటపడినట్లు కస్టమ్స్ కమిషనర్ (అమృత్‌సర్) రాహుల్‌ నంగారే తెలిపారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చండీగఢ్ సర్కిల్ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.

పురావస్తు శాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం ఈ విగ్రహం క్రీ.శ 2 లేదా 3వ శాతాబ్దానికి చెందినదిగా ధ్రువీకరించినట్టు తెలిపారు. భారత పురాతన వస్తువుల చట్టం 1972 ప్రకారం దీన్ని పురాతన వస్తువుగా పరిగణించి, స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, దీని వెనక ఎవరున్నారు.. ఇది ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు.

బుద్ధుని విగ్రహం గాంధార శిల్పకళలో (గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్) కనిపిస్తుందని ASI ధృవీకరించింది. ఇది సుమారు రెండువేల ఏళ్ల నాటికి సంబంధించినదని పేర్కొంటున్నారు. ప్రాచీన గ్రీకు కళలకు చెందిన గాంధార భారత ఖండంలోని వాయువ్య ప్రాంతాలలో విస్తరించి ఉంది. గతంలో వాఘా సరిహద్దుల్లో పురాతన నాణేలు సైతం స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

గాంధార రాజ్యం.. ప్రస్తుత వాయువ్య పాకిస్తాన్, ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉన్న ప్రాచీన ప్రాంతం.. కనిష్క కాలంలో ఉద్భవించిన గాంధార శిల్పకళ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లు, బుద్ధుని శిల్పాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

మళ్లీ గెలుపు నాదే.. కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
మళ్లీ గెలుపు నాదే.. కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
వీటితో మీ గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయండి.. తళుక్కుమంటుంది..
వీటితో మీ గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయండి.. తళుక్కుమంటుంది..
పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు ఏ సిటిజన్ షిప్ ఉందో తెలుసా..
పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు ఏ సిటిజన్ షిప్ ఉందో తెలుసా..
మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు భారతీయులు.. 10 ఏళ్ల జైలు శిక్ష?
మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు భారతీయులు.. 10 ఏళ్ల జైలు శిక్ష?
మామిడి పండు తొక్కతో మీ అందం రెట్టింపు చేసుకోండిలా..
మామిడి పండు తొక్కతో మీ అందం రెట్టింపు చేసుకోండిలా..
తెలంగాణ ఇంటర్‌ 2024 సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే
తెలంగాణ ఇంటర్‌ 2024 సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే
రైలు జనరల్ బోగీ బిక్కుబిక్కుమంటూ కనిపించిన యువకులు..
రైలు జనరల్ బోగీ బిక్కుబిక్కుమంటూ కనిపించిన యువకులు..
టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్.. ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్
టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్.. ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్
బ్లాక్ కాఫీ తాగితే గుండెకు ఎంతో మేలు.. డోంట్ మిస్!
బ్లాక్ కాఫీ తాగితే గుండెకు ఎంతో మేలు.. డోంట్ మిస్!
పులివెందులలో నామినేషన్‌ వేయనున్న సీఎం జగన్.. క్లైమాక్స్‌కి యాత్ర
పులివెందులలో నామినేషన్‌ వేయనున్న సీఎం జగన్.. క్లైమాక్స్‌కి యాత్ర